728X90

0

0

0

0

0

0

0

0

0

ఈ వ్యాసంలో

laugh louder: ఆరోగ్యంగా, క్షేమంగా ఉండాలంటే బిగ్గరగా నవ్వండి
6

laugh louder: ఆరోగ్యంగా, క్షేమంగా ఉండాలంటే బిగ్గరగా నవ్వండి

ఆరోగ్యంగా, క్షేమంగా ఉండాలంటే బిగ్గరగా నవ్వడం

లాఫ్టర్ థెరపీ వృద్ధులపై అద్భుతంగా పని చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థని మెరుగుపరుస్తుంది. గుండెని సంరక్షిస్తుంది. నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది, భావోద్వేగాలను మెరుగుపరుస్తుంది.  

మీరు తరచుగా నవ్వుతూ ఉంటారా? నవ్వడం మీకు రొటీన్ అయితే అది మీ ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్కి ఇంకా మంచిదని నిపుణులు అంటున్నారు.  

 నిజానికి నవ్వు అనేది ఒక థెరపీలాగా పని చేస్తుంది. ఇదొక రకమైన చికిత్స. లాఫ్టర్ థెరపీలో రకరకాల టెక్నిక్స్ ఉపయోగిస్తారు. ఉదాహరణకి బాధ, ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించడానికి హ్యాస్యం పనికొస్తుంది. ఫలితంగా ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని అది మెరుగుపరుస్తుంది.  

 అంతకు మించి మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి: సానుకూలమైన ధోరణి కలిగిస్తుంది, ఆకలి పెంచుతుంది, శారీరక వ్యాయామాలు చెయ్యగలిగేలా బలంగా ఉంచుతుంది.  

ముంబై వాసి అయిన డాక్టర్ మదన్ కటారియా ఒక కేస్ స్టడీ గురించి హ్యాపీయెస్ట్ హెల్త్తో పంచుకున్నారు. ముంబైలోని ఒక కంపెనీ సెక్రటరీగా పనిచేసి రిటైరైన పీటీ హిందూజా 73 ఏళ్ళ వయసులో ఆయన లాఫ్టర్ క్లబ్ లో చేరారు. మెడికల్ డాక్టర్ అయిన డాక్టర్ కటారియా ‘‘నవ్వించే డాక్టర్ గా’’ బాగా పాపులర్ అయ్యారు. ఆయన ప్రపంచవ్యాప్తంగా లాఫ్టర్ క్లబ్ లను ప్రమోట్ చేస్తున్నారు. అలాగే లాఫ్టర్ యోగా ఇంటర్నేషనల్ ని స్థాపించారు. నవ్వుని ప్రోత్సహించడానికి మహారాష్ట్రలోని నాశిక్ లో స్థాపించిన సంస్థ అది.  

 ‘‘హిందూజా గారిది గంభీరమైన వ్యక్తిత్వం. ఆయన అంతగా నవ్వే వ్యక్తి కాదు’’ అని డాక్టర్ కటారియా అన్నారు. ‘‘ఆయన చాలా సంశయంతోనే నా దగ్గరికి వచ్చారు, ఆయన నవ్వగలుగుతారో లేదో కూడా ఖచ్చితంగా ఆయనకి తెలియదు’’ అని కటారియా తెలిపారు.  

 ‘‘ముంబైలోని లాఫ్టర్ క్లబ్లో చేరిన తర్వాత హిందూజా మొదట్లో భయపడ్డారు. ఆయన పెద్దగా నవ్వలేదు. అయితే ఆయన మెల్లిగా ఆత్మ విశ్వాసం పెంపొందించుకున్నారు. ఆరు వారాల తర్వాత ఆయన్ని ఎవరూ చూడట్లేదు అనుకునేంతగా నవ్వడం మొదలుపెట్టారు. ముంబైలో మేం ఒక నవ్వుల పోటీని నిర్వహించాం. హిందూజా దానిలో గెలుపొందారు’’ 

 దాంతో పాటు అధిక రక్తపోటుని నియంత్రించడానికి కూడా హిందూజాకి లాఫ్టర్ థెరపీ ఉపయోగపడిందని డాక్టర్ కటారియా తెలిపారు.  

 ఢిల్లీ, నెథర్లాండ్స్‌లో కేంద్రాలను ఏర్పాటు చేసిన డివైన్ సోల్ యోగా వ్యవస్థాపకుడు దీపక్ మిట్టల్ లాఫ్టర్ థెరపీ గురించి హ్యాపీయెస్ట్ హెల్త్ తో ఇలా పంచుకున్నారు. లాఫ్టర్ థెరపీ అనేది ఒక రకమైన కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. అది శారీరక, మానసిక, సామాజిక బంధాలను ఆరోగ్యకరంగా చేస్తుంది, ఒక వ్యక్తి జీవన నాణ్యతని మెరుగుపరుస్తుంది.  

 మనం నవ్వుతూ ఉంటే మానసికమైన భారం తగ్గుతుందని దీపక్ మిట్టల్ అంటున్నారు. ‘‘మన శరీరంలో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి. ఒక వ్యక్తి ఒత్తిడి, అపరాధ భావం లేదా ఆక్రోశంతో ఉంటే, నవ్వడం వల్ల ప్రతికూల భావోద్వేగాల నుంచి అతని దృష్టి మళ్ళుతుంది. ఉత్సాహం పెరుగుతుంది’’ అని ఆయన తెలిపారు.  

 లాఫ్టర్ థెరపీ ప్రయోజనాలు 

 శారీరకమైన నొప్పులు తగ్గడానికి అలాగే క్యాన్సర్ లాంటి తీవ్రమైన జబ్బులతో పోరాడ్డానికి కూడా లాఫ్టర్ థెరపీ ఉపయోగపడుతుందని మిట్టల్ అన్నారు. ‘‘ఒంటరితనంతో పోరాడటానికి ఇది సహాయపడుతుంది. డిప్రెషన్ లక్షణాలను తగ్గిస్తుంది, నవ్వడం వల్ల ప్రతికూలమైన విషయాల నుంచి నా దృష్టి మళ్లుతుంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. నవ్వు రక్తపోటుని కూడా తగ్గిస్తుందన్నారు. నవ్వడానికి పొత్తికడుపు, డయాఫ్రమ్ కండరాలను ఉపయోగిస్తాం కాబట్టి వృద్ధుల్లో ఆస్తమా, బ్రాంకైటిస్ లాంటి రోగాలను తగ్గించడానికి పనికొస్తుందని ఆయన తెలిపారు.  

 బెంగుళూరు లోని మణిపాల్ హాస్పిటల్స్ లో జిరియాట్రిక్ మెడిసిన్, కన్సల్టెంట్‌గా పని చేస్తున్న డాక్టర్ అనన్య దాస్ లాఫ్టర్ థెరపీ రోగ నిరోధక వ్యవస్థని మెరుగుపరుస్తుందని హ్యాపీయెస్ట్ హెల్త్‌తో చెప్పారు. ‘‘ నవ్వడం వల్ల స్ట్రెస్ హార్మోన్లు తగ్గిపోతాయి. శరీరంలో ప్రతిరక్షకాల స్థాయి పెరుగుతుంది.దాని వల్ల ఇన్ఫెక్షన్లను నిరోధించే సామర్థ్యం పెరుగుతుంది’’ అని ఆమె అన్నారు.  

 లాఫ్టర్ థెరపీ వల్ల శరీరంలోని కణాలకు ఆక్సిజన్ సరఫరా పెరుగుతుందని మిట్టల్ అంటున్నారు. ‘‘దాంతో పాటుగా, అదొక శక్తివంతమైన కార్డియోవాస్కులర్ వ్యాయామాన్ని అందిస్తుంది, కండరాల్ని బలపరుస్తుంది. ముఖ్యంగా శారీరక వ్యాయామాలు చెయ్యడానికి శరీరాల్ని కదల్చలేని వృద్ధులకి ఇది బాగా ఉపయోగపడుతుంది’’ అని ఆయన తెలిపారు. ‘‘లాఫ్టర్ థెరపీ ఒక వ్యక్తి జీవ ప్రక్రియల్ని కణాలు, పరమాణువుల స్థాయిలో మారుస్తుంది. అలాగే పరిస్థితులు, పరిణామాలతో సంబంధం లేకుండా మంచి మానసిక ఆరోగ్యాన్నిస్తుంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.  

 నవ్వడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది కాబట్టి లాఫ్టర్ థెరపీ గుండెను సంరక్షిస్తుందని డాక్టర్లు అంటున్నారు. నవ్వు బీపీని తగ్గించి మలివయసు వారిలో గుండెపోటుని, స్ట్రోక్ లు వచ్చే ప్రమాదాన్ని నివారిస్తుందని చెబుతున్నారు.  

‘‘నవ్వడం వల్ల ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఆ హార్మోన్ వల్ల నొప్పి, ఒత్తిడి తగ్గిపోతాయి’’ అని డాక్టర్ దాస్ అన్నారు. ‘‘నవ్వడం వల్ల మనసు సంతోషంగా ఉంటుంది దాంతో శారీరకమైన ఒత్తిడి, నొప్పులు కూడా తగ్గిపోతాయి దాంతో ఉత్సాహం పెరుగుతుంది. లాఫ్టర్ థెరపీకి ఎలాంటి పరిమితులూ లేవు. వృద్ధులు వాళ్ళకు  వీలైనప్పుడు నవ్వుతూ,సంతోషంగా గడపొచ్చు. అంటే టీవీ చూస్తున్నప్పుడు పిల్లలతో ఆడుతున్నప్పుడు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడుపుతున్నప్పుడు సంతోషంగా ఉండొచ్చు’’ అని డాక్టర్ దాస్ తెలిపారు.  

 నవ్వడం వల్ల శరీరంలో, మెదడులో ఆక్సిజన్ స్థాయి పెరుగుతుందని దాంతో డిమెన్షియా వచ్చే ముప్పు తగ్గుతుందని డాక్టర్ కటారియా హ్యాపీయెస్ట్ హెల్త్ కి చెప్పారు.  

 ప్రక్రియ 

 లాఫ్టర్ థెరపీ లేదా లాఫ్టర్ యోగా అనేవి ప్రత్యేకమైన కాన్సెప్ట్’’ అని డాక్టర్ కటారియా తెలిపారు. ‘‘ఒక గ్రూపుగా కలిసి నవ్వుతాం. నవ్వుని పంచుకోవడంతో మొదలుపెడతాం. అది ప్రథమమైన ఎక్సర్ సైజ్. ఈ ప్రక్రియ సమయంలో ఒకరి పట్ల ఒకరం నిజాయితీగా మారతాం. దాంతో మనుషులు నిజంగానే నవ్వుతారు’’ అని ఆయన అన్నారు.  

 సహజంగా, యథేచ్ఛగా నవ్వితే ఎలాంటి మానసిక, శారీరకమైన ప్రభావం ఉంటుందో ఇలా కావాలని, థెరపీ ద్వారా నవ్వినా కూడా అలాంటి ప్రభావమే ఉంటుందని మిట్టల్ అంటున్నారు. స్వచ్ఛంగా నవ్వడంలో గ్రూపుతో కలిసి పాల్గొంటారు. ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఒకరితో ఒకరు సరదాగా ఉంటారు.  

 ‘‘ఒకసారి స్వచ్ఛందంగా నవ్వడం మొదలుపెడితే అది నిజమైన, ఒకరిని చూసి మరొకరు నవ్వే సాంక్రమిక నవ్వులా మారుతుంది’’ అని మిట్టల్ అన్నారు. ముఖంతో పాటుగా ముఖంలోపల ఉన్న నాడులకు, అన్నవాహిక, గొంతు, ముక్కు, కళ్ళు, చెంపల్లాంటి ఇతర శరీర భాగాలకు కూడా అది వ్యాయామం కలిగిస్తుంది. లాఫ్టర్ థెరపీ శరీరానికి, మెదడుకు ఒక వ్యాయామం లాంటిది’’ అని ఆయన తెలిపారు.  

 లాఫ్టర్ థెరపీలో 15 నుంచి 20 వరకూ దశలు ఉంటాయి. మొదటిది ఒక రిథమ్ లో చప్పట్లు కొట్టడం దాని వల్ల ఆక్యూప్రెజర్ పాయింట్లు ఉత్తేజితం అవుతాయి. తర్వాత లోతైన శ్వాస తీసుకోవాలి, దీని వల్ల ఊపిరితిత్తులు రిలాక్స్ అయ్యి, వ్యక్తి ఉల్లాసం పెరుగుతుంది. తర్వాత చేతులు ఒకవైపు నుంచి మరొకవైపుకి ఊపుతూ, చిన్న పిల్లల్లాగా నవ్వాలి. దీని వల్ల నిజంగానే ఒకరివల్ల మరొకరు నవ్వుతారు.  

 లాఫ్టర్ థెరపీలో రకాలు 

 లాఫ్టర్ థెరపీలో నాలుగు రకాలున్నాయి: 

  1. హ్యూమర్ థెరపీ: దీనిలో భాగంగా నవ్వు తెప్పించే గ్రూప్ సెజన్లు నిర్వహిస్తారు. ఇంకా హ్యూమరస్ బుక్స్ చదవడం, కామెడీ షోలు, సినిమాలు చూడడం ద్వారా నవ్వొచ్చు.  
  2. ట్రిగ్గర్ థెరపీ: ఈ కేసులో ప్రతి వ్యక్తిలో నవ్వుని ప్రేరేపించే ప్రత్యేకమైన అంశాన్ని థెరపిస్ట్ గుర్తిస్తారు. భావోద్వేగపరమైన ఒత్తిడిని అధిగమించడానికి దాన్ని ఉపయోగిస్తారు.  
  3. లాఫ్టర్ యోగా: దీనిలో యోగా, స్ట్రెచింగ్, బ్రీతింగ్ ఉంటాయి. హ్యాసం ఉండొచ్చు, ఉండకపోవచ్చు.  
  4. లాఫ్టర్ మెడిటేషన్: సాధారణమైన మెడిటేషన్ లాగా కాకుండా లాఫ్టర్ మెడిటేషన్ ఉద్దేశం ఒక మనిషిని నవ్వించడం అలాగే వారు ప్రస్తుతం మీద దృష్టిపెట్టేలాగా చెయ్యడం. ధ్యాన స్థితిలో సైలెంట్ గా నవ్వడం ద్వారా స్ట్రెచింగ్ జరుగుతుంది.  

 లాఫ్టర్ థెరపీలో నవ్వు ఆధారిత వ్యాయామాలు ఉన్నాయని డాక్టర్ కటారియా అన్నారు. ప్రాణాయమా లాంటి శ్వాస ఆధారిత వ్యాయామాలు కొన్ని ఉన్నాయి. వీటిలో వ్యక్తులు శ్వాస తీసుకోవడం, నవ్వడం ఒకేసారి చేస్తారు.  

‘‘వృద్ధులు మరింత సరదాగా ఉండేలా కొన్ని వ్యాయామాల్ని డిజైన్ చేశారు’’ అని డాక్టర్ కటారియా తెలిపారు. ‘‘అలాగే విలువల ఆధారిత నవ్వు వ్యాయామాలున్నాయి. ఇవి కొంత అర్థవంతంగా, విలువలతో కూడుకుని ఉంటాయి. అంటే మెచ్చుకోలుగా నవ్వడం, క్షమిస్తూ నవ్వడం లాంటివి ఉన్నాయి’’ అని ఆయన చెప్పారు.  

మీ అనుభవాన్ని లేదా వ్యాఖ్యలను పంచుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ట్రెండింగ్

వ్యాసాలు

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient
We use cookies to customize your user experience, view our policy here

మీ అభిప్రాయం విజయవంతంగా సమర్పించబడింది.

హ్యాపీయెస్ట్ హెల్త్ టీమ్ వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తుంది