728X90

0

0

0

ఈ వ్యాసంలో

చలికాలంలో కీళ్ల నొప్పులను తగ్గించే మార్గాలు
21

చలికాలంలో కీళ్ల నొప్పులను తగ్గించే మార్గాలు

చలికాలంలో శరీరంలో తగినంత రక్తప్రసరణ లేకపోవడం, కండరాల ఒత్తిడి కారణంగా కీళ్ల నొప్పులు చాలా ఎక్కువగా ఉంటాయి. చలికాలంలో వృద్ధులకు, ముఖ్యంగా ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నవారికి చాలా కష్టంగా ఉంటుంది.

చలికాలంలో శరీరంలో తగినంత రక్తప్రసరణ లేకపోవడం, కండరాల ఒత్తిడి కారణంగా కీళ్ల నొప్పులు చాలా ఎక్కువగా ఉంటాయి. చలికాలంలో వృద్ధులకు, ముఖ్యంగా ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నవారికి చాలా కష్టంగా ఉంటుంది.

ఇక్కడ సబితా భట్ విషయమే తీసుకోండి. ముంబైల్ నివసిస్తున్నప్పుడు తన 46 ఏళ్ల వయసులో కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. 2015లో తన కొడుకుతో కలిసి ఉండేందుకు భర్తతో కలిసి బెంగళూరుకు మారాము అని ఇప్పుడు 62 ఏళ్ల వయసున్న భట్ చెప్పారు. ”బెంగళూరులో చలికాలం నా కీళ్లనొప్పుల బాధ మరింత తీవ్రతరమైంది. ముఖ్యంగా రాత్రి సమయాలలో నేను నా మోకాలిని కదల్చడం కానీ వంచడం కానీ చేయలేను.

చలికాలంలో ఆర్థరైటిస్ ఎందుకు పెరుగుతుంది?

ముంబైలో వాషిలోని ఫోర్టిస్ హిరానందని ఆస్పత్రి ఆర్థోపెడిక్ సర్జరీ విభాగం అధిపతి డాక్టర్ ప్రమోద్ భోర్ మాట్లాడుతూ.. 50 ఏళ్లు పైబడిన వారు ముఖ్యంగా చలికాలంలో మోకాళ్ల నొప్పులు పెరుగుతాయని ఫిర్యాదు చేస్తారన్నారు.

చెన్నైలోని అతుల్య సీనియర్ కేర్ హెడ్ డాక్టర్ ఉమాపతి ఎం మాట్లాడుతూ.. పురుషుల కంటే స్త్రీలు అధికంగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారని అభిప్రాయపడ్డారు. ఇందుకు కారణాలు బుుతుస్రావం మరియు హార్మోన్ల హెచ్చుతగ్గులుగా పేర్కొన్నారు.

భట్ విషయంలో, ఆమె శరీరంలో కాల్షియం స్థాయిలు బాగా క్షీణించాయి. ప్రత్యేకించి 40 ఏళ్ల వయసులో ఆమె గర్భాశయాన్ని తొలగించిన తర్వాత.. ఆస్టియో ఆర్థరైటిస్ ప్రారంభమవడానికి అదే కారణం అని ఆమె చెప్పింది.

ఆస్టియో ఆర్థరైటిస్‌లో, మోకాలి కీలులో గుర్తించదగిన మచ్చలు ఏర్పడుతాయి. ఇది కదలికలను పరిమితం చేస్తుంది. తరచుగా కండరాల నొప్పులకు కారణం అవుతుంది. భట్ మరియు అనేక మంది వృద్ధులలో శీతాకాలంలో కీళ్లలో నొప్పి గ్రాహకాల యొక్క హైపర్ సెన్సిటివిటీ కారణంగా పెరుగుతుందని డాక్టర్ భోర్ చెప్పారు.

చలికాలంలో నొప్పి గ్రాహకాల యొక్క హైపర్‌సెన్సిటివిటీ దీనికి కారణం కావచ్చు అని డాక్టర్ భోర్ జత చేశారు.
-అధిక వాతావరణ పీడనం కారణంగా కీళ్లలో రక్త ప్రవాహం తగ్గుతుంది.
-కండరాల దుస్సంకోచం కారణంగా ఎర్రబడిన కణజాలం సాగదు.
-సైనోవియల్ ద్రవం కీళ్ల యొక్క స్థితి స్థాపకత తగ్గడానికి కారణమవుతుంది.

మోకాలి నొప్పిని అదుపులో ఉంచుకోవడం

నిపుణులు మోకాలి నొప్పి పెరుగుదలను నివారించడానికి కొన్ని మార్గాలను సూచిస్తున్నారు. అందులో..

1. చురుకైన జీవనశైలిని కలిగి ఉండటం: మూల కారణాన్ని నివారించడం( కండరాల నొప్పులు), రక్త ప్రసరణను పెంచడం, కీళ్లను లూబ్రికేట్ చేయడం ద్వారా శీతాకాలంలో వృద్ధులలో ఆర్థరైటిస్‌ను నివారించవచ్చని డా. ఉమాపతి చెప్పారు. చురుకైన జీవనశైలి, నడక వంటి సాధారణ వ్యాయామాలను సిఫార్సు చేశారు.

వైకల్యం ఉన్నవారు కండరాలను బలపరిచే వ్యాయామాలు లేదా గోడ సహాయంతో ఇంటి లోపల నడవడం వల్ల మోకాళ్ల నొప్పులు తగ్గుతాయని ఉమాపతి చెప్పారు.

విపరీతమైన చలి ఉన్న సమయాల్లో బహిరంగ వ్యాయామాలు చేయాలనుకుంటే.. 50 ఏళ్లు పైబడిన వ్యక్తులు తప్పనిసరిగా థర్మల్ దుస్తులను ధరించాలి. అవసరమైతే వారి వేళ్లను చేతి తొడుగులతో కప్పుకోవాలి అని డాక్టర్ భోర్ హెచ్చరిస్తున్నారు. అదనంగా, హైడ్రేటెడ్‌గా ఉండటం తప్పనిసరి.

చలికాలంలో బెంగళూరు వాతావరణం నాకు సవాలుగా ఉండేది అని భట్ చెప్పారు. అయితే కొంత కాలానికి ఆ వాతావరణానికి అలవాటు పడి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మొదలు పెట్టానన్నారు. అప్పుడప్పుడు ఇంటిలోపల కూడా నడుస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా ఉదయం, రాత్రి సమయాల్లో మోకాళ్లకు, చేతులకు, కాళ్లకు థర్మల్ దుస్తులతో కప్పుకుంటానన్నారు. ఇది తన మోకాలి నొప్పిని తగ్గిస్తుందని పేర్కొన్నారు.

2.మంచి పోషకాహారం మరియు సప్లిమెంట్స్: కాల్షియం మరియు విటమిన్ డి3(బాదం, పాలు, గుడ్లు వంటివి) సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తినడం ద్వారా కండరాల నొప్పులను నివారించొచ్చని డాక్టర్ ఉమాపతి చెప్పారు. ”అదనంగా, ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు (షార్క్ ఫిష్ ఆయిల్, మాకేరెల్, సాల్మన్, కాడ్ లివర్ ఆయిల్, గుల్లలు, సార్డినెస్) అధికంగా ఉండే ఆహారం కండరాల లూబ్రికేషన్‌ను విపరీతంగా పెంచుతుంది.” ఒక వ్యక్తి యొక్క పరిస్థితి ఆధారంగా కండరాల బలాన్ని తిరిగి పొందడంలో సహాయపడే మందులను కూడా వైద్యులు సూచిస్తారు.

3. రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి చికిత్స: రక్త ప్రవాహాన్ని మెరుగుపరచుకోవడానికి వృద్ధులను ఇటువంటి చికిత్సలను ఎంచుకోమని ప్రోత్సహిస్తున్నారు.
-హాట్ ప్యాక్‌లు(రక్త ప్రసరణను పెంచడానికి మోకాలిని వేడిచేయడం)
-వాక్స్ బాత్ థెరపీ (రక్త ప్రవాహాన్ని పెంచడానికి మరియు సంకోచాన్ని తగ్గించడానికి గాయపడిన మోకాలిపై కరిగించిన పారాఫిన్ మైనంను పూయడం). ఇది ఆసుపత్రిలో మాత్రమే చేయాలి.

గుర్తుంచుకోవాల్సినవి..

శీతాకాలంలో ఆర్థరైటిస్ నొప్పిని అదుపులో ఉంచడానికి వృద్ధులు ఇలా చేయాలి.
-చురుకైన జీవనశైలిని అనుసరించాలి.
-తెల్లవారుజామున శరీరానికి సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. తగినంత విటమిన్-డి, కాల్షియం మరియు ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అందేలా చూసుకోండి.
-కండరాలను బలపరిచే వ్యాయామాలను క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయండి.
-శీతాకాలంలో థర్మల్ వస్త్రాలను ఉపయోగించండి.

మీ అనుభవాన్ని లేదా వ్యాఖ్యలను పంచుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ట్రెండింగ్

వ్యాసాలు

0

0

0

Opt-in To Our Daily Newsletter

* Please check your Spam folder for the Opt-in confirmation mail

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

మీ అభిప్రాయం విజయవంతంగా సమర్పించబడింది.

హ్యాపీయెస్ట్ హెల్త్ టీమ్ వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తుంది