728X90

0

0

0

0

0

0

0

0

0

ఈ వ్యాసంలో

falls among elderly: వృద్ధులు పడిపోయే ప్రమాదాన్ని నివారించడం సాధ్యమే 
5

falls among elderly: వృద్ధులు పడిపోయే ప్రమాదాన్ని నివారించడం సాధ్యమే 

వృద్ధులు పడిపోకుండా ఉండాలంటే ఇళ్ళను వారికి అనువుగా మార్చాలని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. జారకుండా ఆపే సదుపాయాలు, నడక, సమతుల్యాలకు సంబంధించిన థెరపీలతో పాటు, మంచి పోషకాహారం అందించాలని చెబుతున్నారు.

వృద్ధులు పడిపోకుండా ఉండాలంటే ఇళ్ళను వారికి అనువుగా మార్చాలని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. జారకుండా ఆపే సదుపాయాలు, నడక, సమతుల్యాలకు సంబంధించిన థెరపీలతో పాటు, మంచి పోషకాహారం అందించాలని చెబుతున్నారు.  

వృద్ధులను పడిపోకుండా నివారించడం సాధ్యమే, ఫోటో: అనంత సుబ్రమణ్యమ్ కె  కేరళలోని కొట్టాయంకి చెందిన శృతి మ్యాథ్యూ తన 90 ఏళ్ళ బామ్మ కింద పడిపోకుండా చూసుకోడానికి నిరంతరం అప్రమత్తంగా ఉంటారు. ఆమె వాడే బాత్రూం ఎప్పుడూ పొడిగా ఉండేలా వారి కుటుంబం చూసుకుంటుంది. అలాగే బెడ్ దిగిన ప్రతిసారీ చేతికర్ర సాయంతో నడిచేలా అలవాటు చేశారు. బాత్రూంలోకి ఒంటరిగా వెళ్ళినప్పుడు ఆమె పట్టుకోవడానికి లోపల బార్లు అమర్చారు. ‘‘ అదృష్టవశాత్తూ ఇప్పటి దాకా మా బామ్మ కింద పడలేదు, కానీ మేం ఎప్పుడూ ఆమెని గమనిస్తూనే ఉంటాం’’ అని మ్యాథ్యూ చెప్పారు. 

 కింద పడిపోవడం అనేది వృద్ధుల్లో ఉండే ప్రధానమైన సమస్య అయితే తగిన జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు పడకుండా కాపాడుకోవచ్చని బెంగుళూరులోని మణిపాల్ హాస్పిటల్ చైర్మన్, వృద్ధుల వైద్య నిపుణులుగా పని చేస్తున్న డాక్టర్ అనూప్ అమర్‌నాథ్ అన్నారు.  

 వృద్ధులు గనక ప్రమాదవశాత్తూ కింద పడితే ఫలితంగా పెద్ద దెబ్బలు తగులుతాయి. పక్కటెముకలు, వెన్నుపూస, తుంటి విరిగే ప్రమాదం ఉందని ముంబైలోని ములుంద్ లో ఉన్న ఫోర్టిస్ హాస్పిటల్ లో ఆర్థోపెడిక్ సర్జరీ, సీనియర్ కన్సల్టెంట్ గా పని చేస్తున్న డాక్టర్ సచిన్ భోంస్లే అన్నారు. కొన్నికేసుల్లో కింద పడిన దాన్ని బట్టి అలాగే ఏ వస్తువుకి గుద్దుకున్నారు అనేవాటిపై ఆధారపడి తలకు కూడా గాయాలవుతాయని తెలిపారు. ‘‘కింద పడిన తర్వాత వృద్ధులు సాధారణ స్థితికి చేరుకోలేరు. కిందపడినప్పుడు నడుము విరిగితే, 30 శాతం కేసుల్లో వారు ఏడాదికి మించి బతకరు’’ అని డాక్టర్ భోంస్లే చెప్పారు. కిందపడి ఎముకలు విరగకుండా నిరోధించడం చాలా ముఖ్యం అని ఆయన అన్నారు.  

 వృద్ధులు పట్టుతప్పి పడిపోవడానికి అంతర్గత కారణం ఒకటి ఉందని డాక్టర్ అమర్నాథ్ తెలిపారు. ‘‘తలకి గాయంతో, ఎముకలు విరిగి లేదా కాలు విరిగి లేదా మృదు కణజాలాల గాయాలతో వృద్ధులను హాస్పటల్ కి తీసుకొస్తుంటారు, వాటికి సరైన చికిత్స అందించాలి’’ అని డాక్టర్ అమర్‌నాథ్ అన్నారు. ‘‘అదే సమయంలో వృద్ధులు పడిపోవడానికి దారితీసే అంతర్గతంగా ఉన్న కారణం మీద కూడా దృష్టిపెట్టాలి, దానికీ చికిత్స చెయ్యాలి. అందుకే మేం ఫాల్ రిస్క్ అసెస్మెంట్ చేస్తాం, పడిపోవడానికి కారణాలు తెలుస్తాయి’’ అని ఆయన చెప్పారు.  

 అనుకోకుండా అయ్యే గాయలవల్ల సంభవించే మరణాల్లో వృద్ధులు కిందపడడం వల్ల సంభవించే మరణాలు రెండో స్థానంలో ఉన్నాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2021 ఫ్యాక్స్ట్ షీట్ తెలియజేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా దిగువ, మధ్య ఆదాయ దేశాల్లోని దాదాపు 6,84,000 మంది కింద పడడం వల్ల మరణిస్తున్నారు. WHO లెక్కల ప్రకారం ప్రతియేటా 3.73 కోట్ల మంది వృద్ధులు కింద పడుతున్నారు అంటే ఇది వైద్యులు దృష్టిపెట్టాల్సిన తీవ్రమైన సమస్యగా పరిగణించాలి 

 పడిపోవడానికి కారణాలేంటి

 వృద్ధులు తూలిపడిపోవడానికి అంతర్గత, బాహ్యమైన కారణాలుంటాయని డాక్టర్ అమర్నాథ్ చెబుతున్నారు: 

 బాహ్య కారణాలు 

  • ఇంట్లో లేదా బయట జారిపడడం, ఫూట్ మ్యాట్ మీ, సమతలంగా లేని చోట్ల జారిపడుతుంటారు. లైటింగ్ సరిగ్గా లేకపోయినా జారిపడే ప్రమాదం ఉంది.  
  • ఇంటి బయట ఎగుడుదిగుడు ఫుట్ పాత్ లు, నడక మార్గాలు లేదా రోడ్ల మీద పడుతుంటారు.  

అంతర్గత కారణాలు 

  • ప్రతి కండర కదలికలో అవసరమైన ప్రోప్రయోసెప్షన్(కదలిక, చర్య, స్థానాలను పసిగట్టే శారీరక సామర్థ్యం) లేకపోవడం వల్ల పడిపోతుంటారు. కంటిచూపు, వినికిడి, సమతుల్యత యంత్రాంగాల్లో లోపాలు కూడా వృద్ధులు పడిపోవడానికి కారణమవుతుంటాయి.  
  • నడక, సమతుల్యంలో లోపాలున్న వాళ్ళు పడిపోయే ప్రమాదం చాలా ఎక్కువ. 
  • గుండెపోటు, తీవ్రమైన న్యూరో సమస్యలున్నవాళ్ళు పడిపోయే ప్రమాదం ఉంటుంది.  
  • హైపోనేట్రెమియా(సోడియం స్థాయి తగ్గడం) లాంటి జీవక్రియ సమస్యలు, హైపోగ్లైకేమిక్(సుగర్ స్థాయి తగ్గడం) లేదా అసాధారణమైన థైరాయిడ్ వంటివి వృద్ధులు పడిపోవడానికి దారితీస్తాయి.  
  • కాగ్నిటివ్ డిస్ఫంక్షన్(ఉదాహరణకు డిమెన్షియా) ఉన్న వాళ్ళకి పడిపోయే ప్రమాదం ఎక్కువ.  
  • పాలీఫార్మసీ(రకరకాల మందులు వినియోగం) కూడా పడిపోవడానికి దారి తియ్యొచ్చు. యాంటీ డిప్రెసెంట్స్, యాంటీ సైకోటిక్, యాంటీ అలర్జీ, పెయిన్ కిల్లర్స్, సెడేటివ్స్, నిద్రమాత్రల వంటి మందుల వినియోగం వృద్ధులు పడిపోయే ప్రమాదాన్ని పెంచుతుంది.  

 ఈ కారణాలన్నింటితో పాటు ‘‘సార్కోపేనియా(వయసు పెరగడం వల్ల అస్థిపంజర కండరాల్ని, బలాన్ని కోల్పోవడం) ఒక ప్రధానమైన కారణం. వయసు పెరగడంతో స్పందించే చురుకుదనం తగ్గిపోతుంది ఇది కూడా మరొక ప్రమాదకరమైన కారణం’’ అని డాక్టర్ అమర్నాథ్ హ్యాపీయెస్ట్ హెల్త్ కి చెప్పారు.  

 పాత, కొత్త చికిత్సలు 

చికిత్సల విషయానికి వస్తే, ఆ వ్యక్తి తీసుకుంటున్న అన్ని రకాల మందుల గురించి రిస్క్ అసెస్మెంట్ చెయ్యాలి. అలాగే ఆ వ్యక్తి ఉపయోగిస్తున్న మందుల వల్ల ప్రయోజనాలు ఎక్కువున్నాయా లేక ప్రమాదాలు ఎక్కువున్నాయా? అనేది చెక్ చేసుకోవాలని డాక్టర్ అమర్నాథ్ తెలిపారు.  

 కొన్ని సాంకేతిక సాధనాలు కూడా ఉపయోగపడతాయి. చేతులకు ధరిస్తే పడిపోయే ప్రమాదంలో ఉన్నప్పుడు అప్రమత్తం చేసే పరికరాలున్నాయి. ధరించిన వ్యక్తి నడక, భంగిమ, సమతుల్యం ఆధారంగా ఆ వ్యక్తి పడిపోయే ప్రమాదాల్ని అంచనా వేసే పరికరాలు కూడా ఉన్నాయి.  

 ఫంక్షనల్ మొబిలిటీ సామర్థ్యాన్ని కొలవడం కోసం డాక్టర్లు డైమ్డ్ అప్ అండ్ గో అనే ప్రత్యేకమైన స్క్రీనింగ పద్ధతిని కూడా ఉపయోగిస్తున్నారు. టీజీయూటీ స్క్రీనింగ్ లో ఒక వ్యక్తిని కుర్చీలోంచి లేచి నిలబడి పది అడుగుల దూరం నడవమని, వెనక్కి తిరిగొచ్చి మళ్ళీ అదే కూర్చీలో కూర్చోమని చెబుతారు. ‘‘ఈ ఎక్సర్ సైజ్ మొత్తం 12 సెకన్లలో పూర్తవ్వాలి. ఎవరైనా దీనికి 12 సెకన్ల కంటే ఎక్కువ సమయం తీసుకుంటే , మరిన్ని పరీక్షల్ని నిర్వహించాలి. అప్పుడు పడిపోయే ప్రమాదాల గురించి తెలుస్తుంది. నడిచేటప్పుడు, వెనక్కి తిరిగేటప్పుడు, లేదా కూర్చునేటప్పుడు ఆ వ్యక్తి ఎక్కువ సమయం తీసుకుంటున్నాడేమో గమనించాలి. అది కండరాలకు సంబంధించిన సమస్యా లేక జ్ఞానేంద్రియాలకు సంబంధించిందా అనేది కనిపెట్టాలి’’ అని డాక్టర్ అమర్నాథ్ తెలిపారు. ‘‘ పడిపోయే ప్రమాదాల్ని అంచనా వేయడం, క్రియాశీలక సామర్థ్యాల్ని పరీశీలించడంలో టీజీయూటీ ఒక మంచి నాన్ ఇన్వేజివ్ స్క్రీనింగ్ టూల్ గా పని చేస్తుంది. దీని తర్వాత షుగర్, సోడియం, థైరాయిడ్, ఏవైనా ఇన్ఫెక్షన్ల గురించి చెక్ చెయ్యడానికి బ్లడ్ టెస్ట్ నిర్వహించాలి. న్యూరాలజికల్ పరీక్షలు కూడా చెయ్యాలి’’ అని డాక్టర్ అమర్నాథ్ అంటున్నారు.  

 వృద్ధులు పడిపోవడాన్ని నిరోధించడం 

 ఆర్టీఫీషియల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా పని చేసే మెడ పట్టీని ఉపయోగించే తన ఆంటీ(ఇంటిపక్కనే ఉంటున్న 80 ఏళ్ళ మహిళ) గురించి బెంగుళూరుకి చెందిన వి రంచందర్ ఇలా చెబుతున్నారు, ఆ పరికరం పడిపోవడాన్ని అంచెనా వెయ్యదు, ఆపదు. కానీ ఒకవేళ తను పడిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు వెంటనే ఐదుగురి ఫోన్లకు ఎమర్జెన్సీ కాల్స్ ద్వారా సమచారం అందజేసి అప్రమత్తం చేస్తుందని ఆయన చెప్పారు. ఆ పరికరం వాడిన ఆమె అసలు పడిపోలేదు. అయితే ముసలితనానికి సంబంధించిన సమస్యల వల్ల 2021లో ఆమె మరణించారు. అయినప్పటికీ ఒకవేళ పడిపోతే వెంటనే సహాయం అందించేలా చూసుకోవడానికి ఆమె కుటుంబం ఆ పరికరాన్ని ఉపయోగించింది.  

 గైరోస్కోప్ సెన్సార్ అమర్చిన స్మార్ట్ వేరబుల్ డివైజ్ లు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ అమర్నాథ్ చెబుతున్నారు. ఇవి ఒక వస్తువు లేదా వ్యక్తి విన్యాసాన్ని, యాంగులర్ వెలాసిటీని కొలుస్తూ, సరిగ్గా ఉండేలా నిర్వహించగలవు. ‘‘దాన్ని ఉపయోగిస్తున్న వ్యక్తి పడిపోతుంటే గైరోస్కోప్ సెన్సార్ వెంటనే పసిగడుతుంది, వెంటనే సహాయం చెయ్యడానికి అప్రమత్తం చేస్తుంది’’ అని డాక్టర్ అమర్నాథ్ తెలిపారు.  

 ఇంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుని అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటే వృద్ధులు పడిపోకుండా నివారించొచ్చని డాక్టర్ భోంస్లే అంటున్నారు. ఇంటి దగ్గర నడిచే ప్రదేశంలో కాళ్ళకి తగిలే అడ్డంకులు, జారే టైల్స్, తడి ఉండకూడదని ఆయన చెప్పారు. ‘‘సరైన లైటింగ్ తో పాటు జారిపోకుండా నిరోధించే పెయింట్ ని కూడా వేసుకోవాలి. ఇంట్లో వృద్ధులు ఎక్కువగా బయటికి వెళ్ళకుండా, తిరగకుండా చూసుకోవాలి. దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వారి అవసరాలను బట్టీ, లివింగ్ రూంలో చదువుకోవడం, బాత్రూంకి వెళ్ళడం లాంటివి దగ్గరుండేలా చూసుకోవాలి’’ అని డాక్టర్ భోంస్లే తెలిపారు. బాత్రూంలో, రాత్రిపూట తిరిగే ప్రదేశాల్లో సరన లైటింగ్ ఉండాలని చెప్పారు.  

 నడక, సమతుల్యానికి సబంధించిన తెరపీ వల్ల నడక, సమతుల్యం, భంగిమ మెరుగుపడతాయని డాక్టర్ అమర్నాథ్ అంటున్నారు. ‘‘ఒక కాలితో ఉన్న చేతికర్రకి బదులు మూడు కాళ్ళున్న చేతికర్రను ఉపయోగించడం మంచిది. రిస్క్ అంచనా మీద ఆధారపడి కొందరు జిమ్మర్ ఫ్రేమ్ అంటే లోహపు వాకింగ్ ఫ్రేమ్ ఉపయోగించాలని కూడా మేం సూచిస్తూ ఉంటాం. ముందు వైపు చక్రాలు అమర్చి ఉన్న రోలేటర్ అనే వాకింగ్ ఫ్రేమ్ ని కూడా ఉపయోగించొచ్చు. కదలికలో సమస్యలు ఉన్న వాళ్ళకి వీల్ చైర్ వాడమని సలహా ఇస్తుంటాం. అయితే ఈ పరికరాల్ని సౌకర్యంగా ఉపయోగించుకోవాలంటే వాటికి అనువైన పర్యావరణం కూడా ఉండాలి’’ అని డాక్టర్ అమర్నాథ్ అభిప్రాయపడ్డారు.  

 మంచి పోషకాహారం తీసుకోవడం, విటమిన్లు, కాల్షియం లేకుండా చూసుకోవడం వల్ల కూడా వృద్ధులు పడిపోకుండా కాపాడొచ్చు. ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకుంటూ, కండరాల స్పందన, సమన్వయాల్ని మెరుగుపరుచుకోవడం వృద్ధులకు సహాయపడుతుందని డాక్టర్ భోంస్లే తెలిపారు.  

మీ అనుభవాన్ని లేదా వ్యాఖ్యలను పంచుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ట్రెండింగ్

వ్యాసాలు

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient
We use cookies to customize your user experience, view our policy here

మీ అభిప్రాయం విజయవంతంగా సమర్పించబడింది.

హ్యాపీయెస్ట్ హెల్త్ టీమ్ వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తుంది