728X90

0

0

0

అంశాలకు వెళ్లండి

Preventing piles in older people: వృద్ధులలో పైల్స్ నివారించడం
14

Preventing piles in older people: వృద్ధులలో పైల్స్ నివారించడం

వృద్ధులు హెమరాయిడ్లు – సాధారణంగా మొలలు అంటారు – నిర్లక్ష్యం చేయకూడదు. ప్రత్యేకించి వీటినుండి నొప్పి లేకుండా రక్తం కారుతుంటే జాగ్రత్తపడాలి

వృద్ధులు హెమరాయిడ్లు – సాధారణంగా మొలలు అంటారు – నిర్లక్ష్యం చేయకూడదు. ప్రత్యేకించి వీటి నుండి నొప్పి లేకుండా రక్తం కారుతున్నప్పుడు 

రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగి సురేఖ నాయక్, 30 ఏళ్ల పాటు తీవ్రమైన హెమరాయిడ్లతో బాధపడ్డారు. వీటిని సాధారణ భాషలో మొలలు అంటారు. 65 సంవత్సరాల ఒడిస్సా వాసి, తనకు రెండు సర్జరీలు విఫలం అయిన తర్వాత నేచురోపతీ అలాగే ఇంటి చిట్కాల వలన ఉపశమనం దొరికింది అని చెప్పారు. 

 50 సంవత్సరాల వయస్సు దాటిన వారిలో హెమరాయిడ్లు రావడం సహజం, దీని వలన వారి జీవనం కష్టతరం అవుతుంది అలాగే సమస్య తీవ్రం కూడా అవ్వవచ్చు. 

వయస్సు పెరిగే కొద్దీ, చిన్న వయ్ససు వారి కంటే వయస్సు మళ్ళిన వారిని ఇబ్బంది పెట్టే కొన్ని ఆరోగ్య పరిస్థితులను నివారించడానికి సరైన పోషకవిలువలు ఉన్న ఆహారం అలాగే వ్యాయమంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం కీలకం. వీరిని ఇబ్బంది పెట్టే సమస్యలలో కొన్ని మధుమేహం, గుండె వ్యాధులు, స్ట్రోక్ అలాగే హెమరాయిడ్లు. హెమరాయిడ్ల విషయంలో వయస్సు కీలక పాత్ర పోషిస్తుంది. 

నేను మందులు, థెరపీలు ప్రయత్నించాను, వాటి వల్ల తాత్కాలిక ఉపశమనం మాత్రమే లభించింది. ఇప్పుడు క్రమం తప్పకుండా పీచు పదార్థాలు ఎక్కువ ఉండే ఆహారం అలాగే పరిస్థితి మళ్ళీ తిరగబెట్టకుండా ఉండటానికి ఇంటి చిట్కాలు పాటిస్తున్నాను. బొప్పాయి, నానబెట్టిన ఎండుద్రాక్షలు అలాగే వండిన మునక్కాడ ఆకులు వంటి సహజ విరేచనకారులను తీసుకోవడవం వలన పరిస్థితి కాస్త మెరుగుపడింది అని అన్నారు నాయక్. 

వయస్సు మళ్ళిన వారిలో హెమరాయిడ్లను అశ్రద్ధ చేయకూడదు, మరీ ముఖ్యంగా నొప్పి లేకుండా వాటి నుండి రక్తం కారుతున్నప్పుడు. వెంటనే వైద్యులను సంప్రదించాలి అని చెప్పారు డాక్టర్ సూరజ్ సుబ్రమనియన్, చెన్నై ఫోర్టిస్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ జనరల్ సర్జన్. 

పైల్స్ అంటే ఏమిటి? 

మలవిసర్జన సమయంలో ఎక్కువ ఒత్తిడి పెట్టడం కారణంగా మల ద్వారం వద్ద రక్త నాళాలు ఉబ్బడం వలన హెమరాయిడ్లు లేదా మొలలు ఏర్పడతాయి. ఈ రక్త నాళాలు ఎక్కడ ఉన్నాయి అన్న దానిని బట్టి, మల ద్వారం నుండి రక్తం కారడం, నొప్పి ఎక్కువ రావడం జరుగుతుంది. 

వయస్సు ఎక్కువ ఉన్న వారిలో మలబద్ధకం దీనికి ప్రధాన కారణం. 

పైల్స్ లక్షణాలు 

  • మల ద్వారం లోపల బయట దురద పెట్టడం 
  • మల ద్వార ప్రాంతంలో నొప్పి అలాగే దురద పెట్టడం 
  • మల విసర్జన చేసిన తర్వాత నొప్పితో కూడిన రక్త స్రావం 
  • నొప్పితో కూడిన రక్తస్రావం 
  • మల ద్వారం వద్ద వాపు 
  • మల ద్వారం వద్ద నీలిరంగు బొడిపెలు 
  • కూర్చునప్పుడు లేదా నడిచినప్పుడు వెనుక(పిరుదుల) భాగంలో నొప్పి 
  • శ్లేష్మం కారడం 

వయస్సు పెరిగిన వారిలో ప్రధాన కారకాలు మలబద్ధకం, ఊబకాయం, పీచు పదార్థాలు తక్కువ తీసుకోవడం అలాగే ఎక్కువ చలనం లేని జీవనశైలి. 

రెండు రకాల హెరాయిడ్లు: 

అంతర్గత హెమరాయిడ్లు

మల ద్వారం లోపల ఏర్పడతాయి. ఇవి నొప్పి పెట్టవు. కొన్ని సార్లు, మలద్వారం ద్వారా నొప్పి లేకుండా రక్త స్రావం జరుగుతుంది. దీనిని మల విసర్జన తర్వాత శుభ్రం చేసుకునే సమయంలో గమనించవచ్చు. అంతర్గత హెమరాయిడ్లు కొన్ని సార్లు కిందకి జారి మల ద్వారం ద్వారా బయటకు రావచ్చు. ఇవి నొప్పి కలిగించవచ్చు. 

బాహ్య హెమరాయిడ్లు

మల ద్వారం చుట్టూ బయట వస్తాయి. వీటి వలన మల ద్వారం చుట్టూ ఉన్న కండరాలకు దురద పెట్టవచ్చు (అంతర్గత, బాహ్య కండరాలు), హెమరాయిడ్లలో రక్తం గడ్డకట్టినప్పుడు (థ్రోంబోస్డ్ హెమరాయిడ్లు) అవి వాటి చుట్టూ ఉన్న కణాలకు రక్తస్రావాన్ని అడ్డుకుంటాయి, దీని వలన వీపరీతమైన నొప్పి వస్తుంది. మల ద్వారం కింది భాగంలో ఉన్న కణజాలం కూడా దెబ్బతినవచ్చు. 

ఎవరికైనా అంతర్గత హెమరాయిడ్లు ఉండి, నొప్పి, రక్తస్రావం అలాగే మరి వేరే తీవ్రమైన లక్షణాలు లేనప్పుడు, చికిత్స అవసరం కాదు అని డాక్టర్ డొమినిక్ బెంజమిన్ చెప్పారు. ఈయన బెంగుళూరు బాప్టిస్ట్ హాస్పిటల్లో జెరియాట్రిక్స్ హెడ్, అలాగే బెంగుళూరులోని  ఏజ్ వెల్ క్లినిక్‌లో పెద్ద వయస్సు వారికి ఏజింగ్ స్పెషలిస్ట్ అలాగే డయాబెటాలజిస్ట్. 

శరీరంలో కావలసినంత తేమ ఉండేలా, మలబద్ధకం కోసం విరేచనకారులు వాడకం అలాగే మల విసర్జన సమయంలో ఒత్తిడి పెట్టడం చేయకూడదు అని సూచించారు డాక్టర్ బెంజమిన్. రక్తస్రావం అలాగే తీవ్రమైన నొప్పితో కూడిన బాహ్య హెమరాయిడ్ల విషయంలో, హెమరాయిడెక్టమీ సర్జరీ లేదా స్టేపల్డ్ హెమరాయిడోపెక్సీ వంటి చిన్న పద్దతులు అవసరం అవుతాయి అని ఆయన అన్నారు. 

మల ద్వారం నుండి నొప్పితో కూడిన మొలలు, అల్సర్లు లేదా థ్రోంబోస్డ్ హెమరాయిడ్ల(రక్తపు గడ్డలతో ఉన్నవి)కు సంకేతం కాగా, నొప్పి లేకుండా రక్త స్రావం జరుగుతుంది అంటే ఇతర సమస్యలు ఉన్నాయని అర్థం. అంతర్గత హెమరాయిడ్లు పోర్టల్ వ్యవస్థలో ఒత్తిడికి సూచన కావచ్చు, అంటే కటి భాగం లేదా ఉదరం భాగంలో గుర్తించకుండా ఉండిపోయిన క్యాన్సర్, కొలేటరల్ క్యాన్సర్ అలాగే క్రోనిక్ లివర్ డిసీజ్ వంటి వాటికి సూచన కావచ్చు. అలాంటి సందర్భంలో బరువు తగ్గడం, పొట్ట ఉబ్బరం ఉండటం ఇతర లక్షణాలు కావచ్చు. 

జీవనశైలిని మార్చుకోవడం అలాగే ఆహారపు అలవాట్లను మార్చుకోవడం మొలలను నివారించడంలో కీలకం, మలబద్ధకానికి కారణం అయిన విషయాలను పరిష్కరించుకోవాలి. 

హైపోథైరాయిడిజం, శరీరంలో మెగ్నీషియం స్థాయులు అతి తక్కువగా ఉండటం, మానసిక ఆందోళలను తగ్గించే మందులు (మానసిక సమస్యలకు తీసుకునే మందులు) అలాగే నరాల సమస్యల కారణంగా జీర్ణక్రియలో ఆలస్యం మలబద్ధకానికి కొన్ని కారణాలు. వీటిని నిర్లక్ష్యం చేస్తే అవి హెమరాయిడ్లకు దారి తీయవచ్చు అని డాక్టర్ సూరజ్ అన్నారు. ఇలాంటి వైద్యపరమైన కారణాలను తెలుసుకుని వాటిని పరిష్కరించడం కీలకం. 

 పైల్స్‌ను నివారించడం ఎలా 

  1. చురుకుగా ఉండండి, ఎక్కువగా కదులుతూ ఉండండి. 
  2. వయస్సుకు తగిన వ్యాయామాలు చేయడం 
  3. సరైన శరీర బరువు ఉండేలా చూసుకోవడం. 
  4. మలవిసర్జన సమయంలో ఒత్తిడి పెట్టకుండా చూసుకోవడం 
  5. పీచు పదార్థాలు ఎక్కువ ఉండే ఆహారం తీసుకోవడం – రోజుకు కనీసం 30 గ్రాముల పీచు పదార్థాలు ఉండేలా చూసుకోండి 
  6. రోజువారీ మల విసర్జన సమయాలను పాటించడం, ఎక్కువ సేపు టాయిలెట్ సీట్‌పై ఉండకపోవడం.. 
  7. ఎక్కువ నీరు త్రాగడం అలాగే శరీరంలో సరైన తేమ ఉండేలా చూసుకోవడం 

 హెమరాయిడ్లు: వ్యాధి నిర్థారణ అలాగే చికిత్స

వైద్యులు శరీరాన్ని పరిక్షీంచుటకు మరియు పురీషనాళం నుండి రక్తస్రావం ఉందా అని పరీక్షించడానికి మరియు ఏవైనా అంతర్లీన ఆరోగ్య సమస్యలను తెలుసుకోవడానికి పరీక్షలు చేస్తారు. నోటి ద్వారా వేసుకునే మందులు మరియు సమయోచిత క్రీమ్‌లు నొప్పి మరియు వాపును తగ్గించడంలో సహాయపడవచ్చు. మలద్వారంపై మెల్లగా ఐస్ ప్యాక్‌లు పెట్టడం కూడా ఉపశమనం కలిగిస్తాయి. నొప్పి మరియు చికాకును తగ్గించడానికి డాక్టర్ ప్రతిరోజూ కొన్ని నిమిషాలు వెచ్చని నీటిలో కూర్చోవాలని సిఫారసు చేయవచ్చు. 

 అంతర్గత హెమరాయిడ్ల విషయంలో, రబ్బర్ బ్యాంగ్ లైగేషన్ అనే పద్ధతిని ఉపయోగించాల్సి రావచ్చు. ఈ విధానంలో యానోస్కోప్ (చివరన లైట్ ఉండే ట్యూబ్ వంటి పరికరం) లోపలికి పంపించి, దీని ద్వారా లైగేటర్ అనే పరికరాన్ని ఉపయోగించి హెమరాయిడ్లను పట్టుకుని వాటికి రబ్బర్ బ్యాండ్లు కడతారు, దీని వలన వాటంతట అవే కుచించుకుపోతాయి. హెమరాయిడెక్టమీ, కూడా హెమరాయిడ్లను తొలగించగలదు. 

మీ అనుభవాన్ని లేదా వ్యాఖ్యలను పంచుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

twelve + 3 =

ట్రెండింగ్

వ్యాసాలు

వ్యాసం
బెంగళూరుకు చెందిన పి.పార్వతి 20 ఏళ్లప్పుడు శ్వాస తీసుకోవడంలో చిన్నప్పుడు ఇబ్బంది పడేది. పరీక్షలు చేయించగా ఆమెకు ఆస్తమా ఉన్నట్లు నిర్దారించబడింది. ఇప్పుడు అది జరిగి 32 సంవత్సరాలు గడిచింది. 54 సంవత్సరాల వయస్సులో, పార్వతి తన కుమార్తె మరియు తనకంటే సగం వయస్సు కలిగిన స్నేహితులతో ట్రెక్‌లకు చాలా ఈజీగా వెళ్లగలుతుతోంది.
వ్యాసం
షోల్డర్ ఇంపింగ్‌మెంట్ సిండ్రోమ్ రివర్సిబుల్ అయినందున, నొప్పి యొక్క ప్రారంభ సంకేతాలను అనుభవించిన వెంటనే మీరు వైద్యుడిని సంప్రదించాలనిి సలహా ఇస్తారు.
వ్యాసం
ఎముక పునర్నిర్మాణాన్ని నిరోధించడం నుండి ఎముకల విరుగుట మరియు బోలు వ్యాధి ప్రమాదాన్ని పెంచడం వరకు, ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం ఎముకలకు శాశ్వత నష్టం కలిగిస్తుంది

0

0

0

Opt-in To Our Daily Newsletter

* Please check your Spam folder for the Opt-in confirmation mail

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

మీ అభిప్రాయం విజయవంతంగా సమర్పించబడింది.

హ్యాపీయెస్ట్ హెల్త్ టీమ్ వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తుంది