728X90

0

0

0

0

0

0

0

0

0

ఈ వ్యాసంలో

క్యాన్సర్ అనంతరం తాయ్ చి ద్వారా మానసికంగా బలంగా 
9

క్యాన్సర్ అనంతరం తాయ్ చి ద్వారా మానసికంగా బలంగా 

క్యాన్సర్ నుంచి కోలుకుంటున్న ఒక వ్యక్తి తాయ్ చి ద్వారా శారీరకంగా,  మానసికంగా విశ్రాంతి పొందిన ఓ వ్యక్తికి చెందిన సంక్షిప్త కథనం ఇది. 
క్యాన్సర్ తర్వాత తాయ్ చి ద్వారా ఉపశమనం పొందిన వనిత  
తాయ్‌చి-క్యాన్సర్

క్యాన్సర్ నుంచి కోలుకుంటున్న ఒక వ్యక్తి తాయ్ చి ద్వారా శారీరకంగా,  మానసికంగా విశ్రాంతి పొందిన ఓ వ్యక్తికి చెందిన సంక్షిప్త కథనం ఇది. 

ఎలిజబెత్ డే కోల్కతాలో విద్యా విభాగానికి చెందిన ఒక అసోసియేట్ ప్రొఫెసర్. తన ఖాళీ సమయాల్లో ఫిక్షన్, బయోగ్రఫీలు చదవడం అంటే ఆమెకు చాలా ఇష్టం. సంతోషకరమైన స్వభావం కలిగిన చురుకైన వ్యక్తిగా, జీవితంలోని చిన్న విషయాలను ఆస్వాదించడానికి ఇష్టపడే ఆమె, తన కుటుంబంతో ఉండటమే కాకుండా తన బిజీ షెడ్యూల్ నుండి విరామం తీసుకున్నప్పుడు కొత్త ప్రదేశాలను సందర్శించడానికి మరియు అన్వేషించడానికి ఇష్టపడతానని డే అన్నారు. 

​​2016 లో రొమ్ము కేన్సర్ బారిన పడిన డే జీవితం ఛిన్నాభిన్నమైంది. తీవ్ర మనస్తాపానికి గురైనప్పటికీ ఆమె తన డాక్టర్ సలహా మేరకు శస్త్రచికిత్స చేయించుకుని కణితిని తొలగించుకున్నారు. ఆ తర్వాత కీమోథెరపీ, రేడియోథెరపీ కూడా చేయించుకున్నారు. 

​​చికిత్స తీసుకున్నంత కాలం తాను చాలా ఆందోళనగా, నిరాశతోనే ఉండేదానినని డే అన్నారు.  “చికిత్స తీసుకుంటున్న సమయంలో నేను ఎల్లప్పుడూ నా ఇద్దరు కూతుర్ల గురించి మాత్రమే ఆలోచించేదానిని. వారు ఏమైపోతారో అని భయపడేదానినిఅని ఆలోచించేదాన్నంటూ డే ఆ రోజులను మరోసారి గుర్తు చేసుకున్నారు. 

దాదాపు ఏడాది పాటు చికిత్స కొనసాగిన తర్వాత 2017లో డే క్యాన్సర్ నుంచి విముక్తి పొందారు. నిజం చెప్పాలంటే ఆమెకు అది చాలా ఉపశమనం కలిగించింది. కానీ అప్పటివరకు జరిగిన చికిత్స కారణంగా ఆమె బలహీనంగా అయిపోవడంతో పాటు నిరాశతో కుంగిపోయారు.  

చికిత్స తర్వాతి జీవితం 

​​ఆ సమయంలో మానసికంగా, శారీరకంగా మరియు భావోద్వేగపరంగా అలసిపోయేదానినిఅని బాధగా అంటారు అప్పటి సమయాన్ని గుర్తు చేసుకున్న డే. ఇప్పుడు ఆమె వయసు 53 సంవత్సరాలు. 

​​ఆ చేదు జ్ఞాపకాలతో, దాని నుండి బయటపడటానికి తాను ఏమి చేశానో హ్యాపీయెస్ట్ హెల్త్తో సంతోషంగా పంచుకున్నారు డే. 

​​ఆమె కోలుకుంటున్న సమయంలోనే క్రమం తప్పకుండా జాగింగ్ మరియు వ్యాయామం చేసేవారు. అయినప్పటికీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆమె బలహీనంగానే ఉండేవారు. ఫలితంగా జీవితం పట్ల తనకు గల సహజ ఉత్సాహాన్ని కోల్పోయినట్లు అనిపించింది. “నా మానసిక బలం మాత్రమే నన్ను ముందుకు నడిపించిందిఅని చెప్పారు డే. ఇలా దాదాపు ఏడాది సమయం గడిచిపోయింది. 

​​2018లో ఓ సెమినార్లో పాల్గొనడానికి డే కొన్ని రోజులు మలేషియాకు వెళ్లారు. ఆమె స్థానికంగా ఉన్న పరిసరాలను పరిశీలిస్తుండగా; సముద్రపు ఒడ్డున చూసిన ఒక విషయం ఆమెను బాగా ఆకర్షించింది.   

​​అక్కడ ఒక అమ్మాయిని చూసింది. ఆమె తన చేతులతో చాలా అందమైన, మనోహరమైన క్షణాలను చాలా నిదానంగా తనకు తానుగా గడుపుతున్నది. ఆ అందానికి చల్లని గాలి మరింత వన్నెలు అద్దుతోంది. ఆ మొత్తం దృశ్యం నా మెదడులో అలా ముద్రించుకుపోయింది. నిదానమైన కదలికల ఆధారంగా చేసే ఆ చైనీస్ వ్యాయామాన్ని తాయ్ చి అని అంటారని తర్వాత తెలిసింది. 

వ్యాయామ విధానానికి డే చాలా ఆకర్షితులయ్యారుకొందరు దీనినిచలనంలో ధ్యానంఅని పిలుస్తారుఆమె దానిని నేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. 

​​కోల్‌కతాకు తిరిగి వచ్చిన తరువాత, తనకు సమీపంలో గల తాయ్ చి అభ్యాసకుల కోసం వెతికారు డే. ఆ క్రమంలోనే తన నగరంలోనే కార్తికేయ శుక్లా మరియు సిల్వియా దాస్ అనే దంపతులు షైన్ విత్ హెల్త్ అనే కేంద్రంలో దీనిని బోధిస్తున్నారని తెలుసుకుని చాలా సంతోషించారు. వెంటనే డే అక్కడ ఒక కోర్సులో చేరారు. 

శరీరం మరియు మనస్సు 

  ఆరు నెలల పాటు రోజూ క్రమం తప్పకుండా ఉదయం సమయంలో తాయ్ చి చేసిన డే ఆ తర్వాత దాని ఫలితాలను చూడడం ప్రారంభించారు. 

​​ముందు ఆమె కోల్పోయిన తన శారీరక దృఢత్వాన్ని తిరిగి పొందారు. ‘ఇప్పుడు నేను ఒక చిన్నపిల్లలా ఫీలవుతున్నాను. తాయ్ చి నా రోజును ఒక సానుకూలమైన దిశలో సాగేలా చేస్తుంది. ప్రతిసారి సెషన్ ముగిసే సమయానికి ఆ రోజుకి నేను సంసిద్ధం అయ్యా.. అనే భావన నాకు కలుగుతుంది.  

​​తాయ్ చి చేయడం ప్రారంభించక ముందు, జాగింగ్ తర్వాత బాగా అలసిపోయేవారు డే. ఆమె ఇంట్లో ఎలాంటి పనులు చేయకుండా చాలాసేపు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చేది. కానీ తాయ్ చి చేయడం మొదలుపెట్టిన తరువాత, అధిక కష్టం లేకుండా ఇంట్లో ఎక్కువ పని చేయగలదని; అలాగే తన జాగింగ్ సెషన్ల తర్వాత కూడా తన శక్తిస్థాయిలు బాగుండడం ఆమె గమనించారు. 

​​ముఖ్యంగా ఆమె ఆలోచనా తీరులో చాలా మార్పు వచ్చింది.  ‘నేను ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను. చికిత్స తీసుకునేటప్పుడు మరియు తర్వాత కూడా నా భావోద్వేగాల్లో చాలా మార్పులు వచ్చేవి. వాటిని అదుపు చేసుకునేందుకు తాయ్ చి నాకు బాగా సహాయపడింది. అందుకే దానిని నాకు అందిన ఒక ఆశీర్వాదంగా భావిస్తున్నాను నేను’’ అంటారామె. ​ 

అంతర్గత సామరస్యం

మెదడు మరియు శరీరం మధ్య చక్కని సమతుల్యతను సృష్టించే ఓ క్రమశ్రేణిలో గల సున్నితమైన కదలికలనే తాయ్ చిగా వర్ణిస్తారు. 

​​2021లో ప్రచురించిన ఒక అధ్యయనం ఆందోళన మరియు నిరాశను తగ్గించడంలో తాయ్ చి సహాయపడుతుందని ప్రాథమిక ఆధారాలను బయటపెట్టింది. 

​​డే శిక్షకులలో ఒకరైన సిల్వియా దాస్ మాట్లాడుతూ, “తాయ్ చి నెమ్మదిగా చేసే కదలికలతో మన శ్వాసను సింక్ చేయడంనేర్పుతుంది. కాలక్రమేణా, మీరు తాయ్ చి చేయనప్పటికీ నెమ్మదిగా శ్వాస తీసుకోవడం అనేది మీకు ఒక అలవాటుగా మారుతుంది. గరిష్ట ప్రయోజనాలను పొందడానికి తాయ్ చి ని క్రమం తప్పకుండా సాధన చేయాలని అంటారామె. 

​​ఫ్రాంటియర్ ఆఫ్ హ్యూమన్ న్యూరోసైన్స్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం నెమ్మదిగా శ్వాసించడం ద్వారా సౌకర్యవంతంగా అనిపిస్తూనే; విశ్రాంతి పొందినట్లు ఉంటుంది. అలాగే ఆందోళన మరియు నిరాశకు సంబంధించిన లక్షణాలను కూడా తగ్గించడంలో ఇది సహాయపడుతుందని తెలియజేస్తుంది. 

కోపం మరియు నొప్పి నియంత్ర 

తాయ్ చినిక్రమం తప్పకుండా సాధన చేయడం ద్వారా కోపం వంటి భావోద్వేగాలను నియంత్రించడంలో అది మనకు సహాయపడుతుందని శిక్షకులు అంటున్నారు. 

తాయ్ చి ద్వారా దీర్ఘ విశ్రాంతి లభించి, అణచివేయబడిన భావోద్వేగాలు సైతం విడుదల చేయవచ్చని అంటారు కోల్‌కతా కేంద్రానికి చెందిన శుక్లా. 

​​​ నిత్య గురుకులంలో తాయ్ చి శిక్షకురాలిగా పనిచేస్తున్న సుధా సుందరం తను తాయ్ చి అభ్యసించడం మొదలుపెట్టిన సమయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. “నా మైగ్రేన్ నొప్పికి తాయ్ చి నాకు ఎలా సహాయపడిందో చూసి నేను ఆశ్చర్యపోయాను. అది మొదలుపెట్టిన తర్వాత బాధను చాలా వరకు తట్టుకోగలిగాను.’’ అని ఆమె చెప్పుకొచ్చారు.   

​​తాయ్ చి మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా సహాయపడుతుందని సుందరం చెప్పారు. ఈ ప్రక్రియ వల్ల శరీరం, భావోద్వేగాలు, అనుభూతులు, పరిసరాలపై అవగాహన ఏర్పడుతుంది. స్వీయఅవగాహన లేదా స్పష్టమైన మనస్సు కారణంగా అది తప్పులు లేకుండా తగిన నిర్ణయాలు తీసుకునేలా మార్గనిర్దేశం చేస్తుందిఎలిజబెత్ డే కూడా తన విషయంలో ఇదే గమనించారు. 

మీ అనుభవాన్ని లేదా వ్యాఖ్యలను పంచుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ట్రెండింగ్

వ్యాసాలు

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient
We use cookies to customize your user experience, view our policy here

మీ అభిప్రాయం విజయవంతంగా సమర్పించబడింది.

హ్యాపీయెస్ట్ హెల్త్ టీమ్ వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తుంది