728X90

0

0

0

ఈ వ్యాసంలో

Allergic rhinitis?: అలెర్జీరినిటిస్ కి హోమియోపతి ద్వారా సంపూర్ణ పరిష్కార విధానం
16

Allergic rhinitis?: అలెర్జీరినిటిస్ కి హోమియోపతి ద్వారా సంపూర్ణ పరిష్కార విధానం

అలెర్జీ రినిటిస్ నిర్వహణలో వ్యాధి వాహకాలను నివారించడం మరియు పూర్తి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం వంటివి ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు

అలెర్జీరినిటిస్ నిర్వహణలో వ్యాధి వాహకాలను నివారించడం మరియు పూర్తి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం వంటివి ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

2018 సంవత్సరానికి  అక్షయ్ రాథోడ్ కి 22 సంవత్సరాలు. వయస్సులోనే అతను  “జలుబు వంటి లక్షణాలనుగుర్తించడాన్ని గమనించారు. జలుబు రావడం మొదలవ్వగానే అతనికి తుమ్ములు రావడం ప్రారంభమైంది. ఒక్కోసారి తుమ్ములు కొన్ని గంటల తరబడి వస్తూనే ఉంటుంది. చల్లటి గాలులు వీచడం వల్ల కూడా తుమ్ములు తగ్గకుండా నిరంతరం రావడానికి కారణమౌతాయి. అందువల్ల అతను బయటకు వెళ్లడానికి కూడా భయపడ్డాడు. అతనికి జలుబుతో పాటు ముక్కు కారటం మరియు కళ్ళ నుండి నీరు కారడం వంటి ఇతర లక్షణాలు కూడా ఉన్నాయి. 

అక్షయ్ రాథోడ్ జలుబు మరియు ఇతర లక్షణాలతో బాధపడుతున్నందున అతనికి   మానసికంగా, శారీరకంగా బలహీనంగా అయిపోతున్నాననే భావన కలగడం మొదలైంది. దీనితో డాక్టర్ దగ్గరకు వెళ్లి చూపించుకోగా తనకు అలర్జిక్ రినిటిస్ సోకినట్ల నిర్ధారణ అయింది. దీనిని తగ్గించుకోవడం కోసం రెండు నెలల వరకు రాసించిన మందులు వేసుకోవాలని వేసుకొన్న తర్వాత కొంత వరకు తగ్గుతుందని డాక్టర్ చెప్పారు. అయితే, తాను మందులు తీసుకోవడం మానేసినప్పుడు లక్షణాలు అనేవి  తిరిగి రావడం జరిగింది. 

తాను దీర్ఘకాలం అనారోగ్యం బారిన పడకుండా ఉండటం కోసం, అతను గ్వాలియర్లోని ఓం హోమియోపతిక్ క్లినిక్కు చెందిన డాక్టర్ దేవేష్ పాఠక్ను సంప్రదించాడు, అతను తాను  ముందు తెలుసుకున్న ట్రీట్మెంట్ గురించి పూర్తిగా అవగాహన చేసుకొన్నతర్వాత అతనికి వేరొక రకమైన మందులను సూచించాడు. మందులను ఒక నెల తీసుకున్నాక తాను శారీరకంగా మరియు మానసికంగా బాగున్నానని  రాథోడ్ చెప్పారు. నాలో ఆరోగ్య లక్షణాలు మెరుగుపడటం ప్రారంభించాయి. అయినప్పటికీ దీర్ఘకాలిక ఆరోగ్యం కోసం ఆరు నెలల వరకు డాక్టర్ పాఠక్ సూచించినందున మందులను నేను  తీసుకొంటునే ఉన్నాను.

అలెర్జీరినిటిస్ అంటే ఏమిటి?   

బెంగుళూరులోని పద్మ హోమియోపతి హీలింగ్ సెంటర్ కన్సల్టెంట్ అయిన  డాక్టర్ భరత్ మంజునాథ్ మాట్లాడుతూఒక వ్యక్తి పుప్పొడి, దుమ్ము లేదా అచ్చు వంటి అలెర్జీ కారకాలతో భాధపడుతుంటే,అతని శరీరంలో కొన్ని తాపజనక రసాయనాలను (హిస్టమిన్ మరియు ప్రోస్టాగ్లాండిన్స్ వంటివి) విడుదల చేయడం ద్వారా రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందిస్తుంది. అది ముక్కు కారడం లేదా మూసుకుపోవడం, తుమ్ములు, దురద మరియు కళ్ళు నీరు కారడం వంటి లక్షణాలకు కారణమవుతుంది. 

ఫ్రాంటియర్స్ జర్నల్లో ప్రచురించబడిన 2022 అధ్యయనం ప్రకారం, మన రోజువారీ కార్యకలాపాలలో భాగం అయిన నిద్ర, పాఠశాల లేదా పని ఉత్పాదకత వంటి అంశాలను స్థితి లక్షణం ఎలా ప్రభావితం చేస్తుందనే దాని ఆధారంగా వాటి తీవ్రతను లెక్కిస్తారు. 

వేరుశెనగ, గోధుమలు, పాలు వంటి ఆహార పదార్థాలు అలెర్జీకి  కారకాలుగా పనిచేస్తాయి. ఇంకా పిల్లి మరియు కుక్క డాండర్ వంటి పెంపుడు జంతువులు కూడా అలెర్జీ కారకాలుగా  పనిచేయడంలో ఇంకా చురుకుగా ఉంటాయని అధ్యయనాలలో తెలిసింది. ఇవే కాకుండా ఇంటిలోపలి ఉండే దుమ్ము ధూళి ఇంకా పురుగులు మరియు బొద్దింకలు కూడా  అలెర్జీలకు  కారకాలుగా మారుతున్నాయి. 

ఇలాంటి పరిస్థితి ఒక వ్యక్తి జీవితంలో సంవత్సరంలోనైనా సమయంలోనైనా ప్రభావితం చేయగలదు. గాలిలో ఎక్కువ పుప్పొడిని తీసుకువచ్చే ఋతువులలో (వసంత మరియు శరదృతువు) సర్వసాధారణంగా ఉంటుంది. 

అలెర్జీరినిటిస్‌లో హోమియోపతి ఎలా పనిచేస్తుంది

 ఇతర ఆరోగ్య పరిస్థితుల మాదిరిగానే, హోమియోపతి జీవనశైలిలో మార్పులు మరియు అలెర్జీ రినిటిస్ కోసం మందులను సూచించే ముందు వ్యక్తి జీవితంలోని అన్ని అంశాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అని డాక్టర్ పాథక్ చెప్పారు. ఒక వ్యక్తి యొక్క మానసిక మరియు శారీరక అంశాలు, వైద్య చరిత్ర, కుటుంబ చరిత్ర మరియు ఇతర లక్షణాలు హోమియోపతికి ఉపయోగపడతాయి. “మేము అలర్జిక్ రినిటిస్ లక్షణాలపై మాత్రమే దృష్టి పెట్టకుండా నిద్రలో ఇబ్బంది లేదా ప్రేగు కదలికలు వంటి ఇతర లక్షణాలపై కూడా మేము ప్రాధాన్యతను ఇస్తామనిఅని ఆయన చెప్పారు. 

అతని ప్రకారం, సంపూర్ణ విధానం మొత్తం ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. హోమియోపతి యొక్క ఏడు సూత్రాల ఆధారంగా మందులు మరియు జీవనశైలి మార్పులను సూచించటం జరిగింది. అంతేకాకుండా తక్కువగా పునరావృతమయ్యే ఒకే రకమైన ఔషధంను ఎంపిక చేయబడుతుందని, డాక్టర్ పాథక్ చెప్పారు. 

హోమియో మందులు లక్షణాల తీవ్రతను మరియు తరుచుగా సంభవించడాన్నిక్రమంగా తగ్గించడంలో సహాయపడతాయి, తద్వారా జీవన నాణ్యతను మెరుగుపరుస్తాయని డాక్టర్ మంజునాథ్ చెప్పారు. 

నిపుణుల సూచనలు 

  • వ్యాధి లక్షణాలను ఎక్కువగా పెంచే వాహకాలను గుర్తించడం మరియు నివారించడం చాలా ముఖ్యం. అంతేకాకుండా పీల్చడం వల్ల వచ్చే అలర్జీల సంఖ్యను కుడా బాగా తగ్గించవచ్చు, ధరించిన ముసుగు అనేది ఓపెన్గా లేకుండా ఉండేలా చూసుకోవాలి. వ్యాధి లక్షణాలను తగ్గించటానికి ముసుగును సరిగ్గా శుభ్రంగా ఉండేలా ధరించామా లేదా అని నిర్ధారించుకోండి.
  • పరిసరాలను దుమ్ము ధూళి లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
  • పుప్పొడి రేణువుల సంఖ్య మరియు ఋతువులపై శ్రద్ధ వహించండి మరియు వీలైనంత వరకు బయటకు వెళ్ళకుండా చూసుకోండి. 
  • తేమ / ధుమ్ము ధూళి ప్రదేశాలలో తరచుగా భూజు పెరుగుతాయి.ఇది చాలా మందికి వ్యాధి కారకంగా పని చేస్తుంది. కాబట్టి ఇంటి లోపల పొడిగా ఉంచండి.
  • ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు పని ఒత్తిడిని తగ్గించుకోవడం అనేది పూర్తి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మరియు వ్యాధి లక్షణాల తీవ్రతను తగ్గించడానికి సహాయపడతాయి.

మీ అనుభవాన్ని లేదా వ్యాఖ్యలను పంచుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

one × 2 =

ట్రెండింగ్

వ్యాసాలు

వ్యాసం
బెంగళూరుకు చెందిన పి.పార్వతి 20 ఏళ్లప్పుడు శ్వాస తీసుకోవడంలో చిన్నప్పుడు ఇబ్బంది పడేది. పరీక్షలు చేయించగా ఆమెకు ఆస్తమా ఉన్నట్లు నిర్దారించబడింది. ఇప్పుడు అది జరిగి 32 సంవత్సరాలు గడిచింది. 54 సంవత్సరాల వయస్సులో, పార్వతి తన కుమార్తె మరియు తనకంటే సగం వయస్సు కలిగిన స్నేహితులతో ట్రెక్‌లకు చాలా ఈజీగా వెళ్లగలుతుతోంది.
వ్యాసం
షోల్డర్ ఇంపింగ్‌మెంట్ సిండ్రోమ్ రివర్సిబుల్ అయినందున, నొప్పి యొక్క ప్రారంభ సంకేతాలను అనుభవించిన వెంటనే మీరు వైద్యుడిని సంప్రదించాలనిి సలహా ఇస్తారు.
వ్యాసం
ఎముక పునర్నిర్మాణాన్ని నిరోధించడం నుండి ఎముకల విరుగుట మరియు బోలు వ్యాధి ప్రమాదాన్ని పెంచడం వరకు, ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం ఎముకలకు శాశ్వత నష్టం కలిగిస్తుంది

0

0

0

Opt-in To Our Daily Newsletter

* Please check your Spam folder for the Opt-in confirmation mail

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

మీ అభిప్రాయం విజయవంతంగా సమర్పించబడింది.

హ్యాపీయెస్ట్ హెల్త్ టీమ్ వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తుంది