728X90

0

0

0

0

0

0

0

0

0

ఈ వ్యాసంలో

యోగ ముద్రల వెనుక ఉన్న శాస్త్రజ్ఞానం
12

యోగ ముద్రల వెనుక ఉన్న శాస్త్రజ్ఞానం

యోగాలో చూపించే చేతి సంజ్ఞలు కేవలం ఆసనాలుగా మాత్రమే పరిగణించకూడదు. ప్రతి సంజ్ఞ దాని కంటూ ఒక స్వంత ఆరోగ్య ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. 
యోగ ముద్రల వెనుక ఉన్న శాస్త్రం
ప్రతీకాత్మాక చిత్రం | షట్టర్ స్టాక్

యోగముద్రలు:యోగాలో చూపించే చేతి సంజ్ఞలు కేవలం ఆసనాలుగా మాత్రమే పరిగణించకూడదు. ప్రతి సంజ్ఞ దాని కంటూ ఒక స్వంత ఆరోగ్య ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది.    

నేను ఆసక్తితో యోగా ముద్రను వేయడం మొదలుపెట్టాను, వేస్తూ ఉండే కొద్దీ నాకు అది  ప్రయోజనకరంగా మారింది, ఎందుకంటే ఇది నా చేతులు మరియు వెనుక వెన్ను భాగంలో వివరించలేని నొప్పి నుండి ఉపశమనం పొందడానికి సహాయపడిందిఅని మైసూరులోని JSS డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రియాంక నితిన్ తన అనుభవాన్ని వివరించారు.  

డాక్టర్ నితిన్కి కుడి చేతి దగ్గర విపరీతమైన నొప్పి వచ్చేది. ఆమె కొయ్య బద్దల మరియు మందులను ఉపయోగించి నొప్పిని తగ్గించడానికి ప్రయత్నించింది, వైద్యం వల్ల నొప్పి తగ్గినప్పటికి దీర్ఘకాలిక ఉపశమనం లభించలేకపోయింది.అలానే  దాదాపు ఏడాదిన్నర పాటు నొప్పిని భరించిన తరువాత ఆమె యోగా సహాయాన్నిఆశ్రయించింది 

ఆమె తాను పడుతున్న ఆందోళన గురించి యోగాను నిత్యం సాధన చేసే తన అమ్మమ్మతో చెప్పుకుంది, దాంతో ఆమెకు వాళ్ళ అమ్మమ్మ యోగా ముద్రలను ప్రయత్నించమని సలహా ఇచ్చింది. 

ఇది పెద్దగా ఆసక్తికానరాని అభ్యాసం కానీ సాధన ద్వారా నేను దీన్ని ప్రయత్నించాను. వారం రోజుల పాటు కొన్ని ప్రత్యేకమైన యోగా ముద్రలను ప్రయత్నించానుఅని డాక్టర్ నితిన్ చెప్పారు. వారం రోజుల్లో తేడాను చూడగలిగానని, వివిధ ముద్రలను దినచర్యగా చేర్చుకుంటూనే ఉన్నానని ఆమె చెప్పారు. 

దంతవైద్యులు వారి వృత్తిపరమైన భంగిమల కారణంగా కండర కణజాల రుగ్మతలకు ఎక్కువగా గురయ్యే అవకాశం ఉందని ఒక అధ్యయనం నిరూపించింది. డాక్టర్ నితిన్ తన సమీక్షా పత్రంలో నొప్పి లక్షణాల నుంచి ఉపశమనం కలిగించే వివిధ యోగ ముద్రలను గురించి కూడా ప్రస్తావించారు. 

యోగ ముద్రను అర్థం చేసుకోవడం 

ముద్ర అనేది సంస్కృత పదం, దీని అర్థం ముద్ర, తాళం లేదా సంజ్ఞ. ముఖ్యంగా చేతి వేళ్లను ఉపయోగించి చేసే సంజ్ఞలను ముద్రలు అంటారని నిపుణులు వివరించారు. 

హావభావాలు నొప్పి నుండి ఉపశమనం కలిగించడంలో సహాయపడే విధంగా ఉంటుంటాయి.  ఇంకా శరీరంలోని శక్తి ప్రవాహాన్ని సులభతరం చేస్తాయిఅని బెంగుళూరులోని అర్త్యోగ్ లివింగ్ యోగా అకాడమీ వ్యవస్థాపకుడు శరత్ బసవరాజు చెప్పారు. 

వివిధ శాస్త్రీయ నృత్య రూపాల్లో వ్యక్తీకరణలు, భావోద్వేగాలను ప్రదర్శించడానికి ముద్రలను ఉపయోగిస్తారని ఆయన చెప్పారు. 

ప్రాథమికాంశాలు మరియు మన వేళ్ళతో వాటి సంధానం 

మన చేతి యొక్క ఐదు వేళ్లు అనేవి మన శరీరం మరియు ప్రకృతి యొక్క ఐదు శక్తులకు ప్రాతినిధ్యం వహిస్తాయిఅని బీహార్ లోని పాట్నాలోని సోహమ్ యోగాధామాకు చెందిన యోగా శిక్షకుడు హృతిక్ రాజ్ కుమార్ చెప్పారు.  

అంతరిక్షం (ఆకాశం), గాలి (వాయువు), నిప్పు (అగ్ని), నీరు (జలం), భూమి (పృథ్వీ) అనే ఐదు ప్రాథమిక అంశాలు (పంచమహాభూతాలు). ఇవి మన శరీర ధర్మాన్ని ప్రభావితం చేస్తాయని కుమార్ వివరించారు  

బొటనవేలు అగ్నిని సూచిస్తుంది, చూపుడు వేలు గాలిని సూచిస్తుంది, మధ్య వేలు అంతరిక్షం (ఆకాశం)ను సూచిస్తుంది, ఉంగరపు వేలు భూమిని సూచిస్తుంది మరియు చిటికెన వేలు నీటి మూలకాన్ని సూచిస్తుంది. 

వీటిలో ఒక్కటి అసమతుల్యతకి దారి తీసినా అది మన ఆరోగ్య పరిస్థితిని దెబ్బతీస్తుంది. అటువంటి శక్తులను సమతుల్యం చేయడానికి ముద్రలు సహాయపడతాయని నిపుణులు అంటున్నారు. 

ముద్రల రకాలు  

పరిశోధకులు సునీత ఎస్ మరియు చంద్ర ప్రకాష్ శర్మ వారి సమీక్షా పత్రంలో ముద్రలను క్రింది విధంగా వర్గీకరించారు: 

1. యోగిక్ ముద్రయోగ సాధనలో 25 ఉపరకాల ముద్రలు ఉన్నాయి. కొన్ని ఉదాహరణలు: మహాముద్ర, హఠ యోగా యొక్క పురాతన రూపాలలో ఒకటి మరియు ఒక వ్యక్తి యొక్క మానసిక అవగాహనను పెంచుతుందని చెప్పబడింది. చిన్ ముద్ర అనేది జ్ఞానం యొక్క సంజ్ఞ అని పిలువబడే మరొక రూపాంతరం 

2.ఆధ్యాత్మిక ముద్ర సంజ్ఞలు శాంతి, జ్ఞానం మరియు ఏకాగ్రతను పొందడానికి ఉపయోగపడతాయి. కొన్ని ఉదాహరణలు, జ్ఞాన ముద్ర (జ్ఞానాన్ని పొందడం), ధ్యాన ముద్ర (ధ్యానం చేసేటప్పుడు ఏకాగ్రతను పొందడం). 

3.    రోగనాశక/నివారణ ముద్రఆరోగ్య పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి రకమైన సంజ్ఞ చేస్తారు. శరీర నిర్విషీకరణ కోసం అపాన ముద్ర లేదా పరిశుద్ధ సంజ్ఞ, సంతానోత్పత్తి మరియు రుతుచక్రం కొరకు యోని ముద్ర లేదా గర్భాశయ సంజ్ఞ లేదా గుండె ఆరోగ్యానికి హృదయ ముద్ర కొన్ని ఉదాహరణలు. 

4.    మతపరమైన ముద్రపేరుకు తగ్గట్టుగానే ఇవి మతపరమైన ఆచారాలకు సంబంధించినవి. వీటిని నృత్య రూపాల్లో లేదా శిల్పాల్లో (విగ్రహాలు) ఆచరిస్తారు. కొన్ని ఉదాహరణలు భూమి స్పర్శ ముద్ర, అంటే భూమిని తాకడం మరియు అభయ ముద్ర అంటే నిర్భయత యొక్క సంకేతం.  

5.    ఆచారరీత్యా ముద్రఇవి స్వప్రయోజనాల కోసం చేస్తారు. కొన్ని దాహరణలు అంజలి ముద్ర, అంటే ఒక వ్యక్తిని పలకరించడం, ప్రార్థన మరియు ఆరాధన చేయడం మరియు యోగ శ్వాస వ్యాయామాలను చేసేటప్పుడు ఉపయోగించే ప్రాణాయామ ముద్ర. 

ప్రతి యోగా పాఠశాల వారి స్వంత వర్గీకరణను కలిగి ఉంటుంది మరియు ప్రతి  వ్యవస్థకు ముద్రల సంఖ్య భిన్నంగా ఉంటుందిఅని కుమార్ పేర్కొన్నారు. 

మీ అనుభవాన్ని లేదా వ్యాఖ్యలను పంచుకోండి

ట్రెండింగ్

వ్యాసాలు

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient
We use cookies to customize your user experience, view our policy here

మీ అభిప్రాయం విజయవంతంగా సమర్పించబడింది.

హ్యాపీయెస్ట్ హెల్త్ టీమ్ వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తుంది