728X90

0

0

0

ఈ వ్యాసంలో

స్లీప్ ట్రాకర్స్ ఉపయోగించడం మంచిదేనా?
29

స్లీప్ ట్రాకర్స్ ఉపయోగించడం మంచిదేనా?

నిద్రను అంచనా వేయడానికి స్లీప్ ట్రాకర్లు ప్రామాణికం కాదు. బదులుగా అవి మీ మెరుగైన నిద్ర విధానాలపై మరియు మెరుగైన ఆరోగ్యం కోసం సరైన జీవనశైలి నిర్ణయాలు తీసుకోవడంలో మీకు సహాయపడతాయి.

పెరుగుతున్న నిద్రలేమి సమస్యలు మరియు వివిధ రుగ్మతలు మంచి నాణ్యమైన నిద్రకు ప్రాధాన్యతను పెంచాయి. గత కొన్నేళ్లుగా యాక్టివిటీ ట్రాకర్ల విక్రయాలు పెరిగిపోయాయి. మన రోజువారీ కార్యకలాపాలైన నడక, పరుగు మరియు వ్యాయామాలను ట్రాక్ చేసే వారి సంఖ్య అనేక రెట్లు పెరిగింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ జాబితాకు స్లీప్ ట్రాకింగ్ వంటి పరికరాలు జోడించబడ్డాయి.

ఈ పరికరాలు మన నిద్ర విధానాలను ట్రాక్ చేస్తాయి. మనం ఎప్పుడు నిద్రపోతున్నాం, ఎన్ని గంటలు నిద్రపోతున్నాం. కొన్ని పరికరాలైతే మన నిద్ర యొక్క వివిధ దశలను కూడా లెక్కిస్తాయి. అయితే ఈ స్లీప్ వేరబుల్స్ ఎంత ఖచ్చితమైనవి? అవి ప్రభావవంతంగా ఉన్నాయా? ఇవి మనకు సహాయం చేస్తున్నాయా లేదా కొత్త సమస్యలను సృష్టిస్తున్నాయా?

మనం ధరించగలిగే స్లీప్ ట్రాకర్స్ ఎలా పని చేస్తాయి?

వాచీలు లేదా రింగ్‌లు వంటి మనం ధరించగలిగే స్లీప్ ట్రాకర్స్ మన నిద్ర విధానాల గురించి సమాచారాన్ని అందిస్తాయి. మనకు నిద్రకు సంబంధించిన స్కోర్ ఇవ్వడానికి శరీర కదలికలు మరియు హృదయ స్పందన రేటు వంటి ప్రమాణాలను అనుసరిస్తారు.

ఈ ప్రమాణాల ఆధారంగా స్కోరు 50 నుంచి 100గా ఉండవచ్చని బెంగళూరులోని ఆస్టర్ సీఎంఐ ఆస్పత్రిలోని ఇంటర్వెన్షనల్ పల్మోనాలజీ, స్లీప్ మెడిసిన్ మరియు ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్ చీఫ్ మరియు సీనియర్ స్పెషలిస్ట్ సునీల్ కుమార్.కె చెప్పారు.

ఆసుపత్రిలో నిద్రను పాలిసోమ్నోగ్రఫీ అనే ప్రక్రియ ద్వారా ట్రాక్ చేస్తారు. ఈ ప్రక్రియలో నిద్ర వివిధ దశలు, మెదడు కార్యకలాపాలు, హృదయ స్పందన రేటు, శరీర ఉష్ణోగ్రత, గాలిప్రవాహం మరియు ఆక్సిజన్ సంతృప్తత వంటి వివిధ ప్రమాణాలను కొలుస్తారు.

స్లీప్ వేరబుల్స్/వేరబుల్ డివైజ్‌లు నిద్రను కొలవడానికి, వాచ్‌లు లేదా రింగ్‌లు, సిగ్నల్‌లను క్యాప్చర్ చేయడానికి సెన్సార్‌లు మరియు రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీలను ఉపయోగిస్తాయి. ఇవి శరీర కదలిక [యాక్సిలెరోమీటర్ ద్వారా] మరియు హృదయ స్పందన రేటు [ఫోటోప్లెథిస్మోగ్రఫీ ద్వారా] వంటి సాధారణ సంకేతాలను సంగ్రహిస్తాయని విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త మరియు క్లినికల్ సైకాలజీ పరిశోధకుడు జెస్సీ కుక్ చెప్పారు.

”పరికరాలు ప్రతిస్పందించడానికి అనుసరించే ప్రమాణాలు మారుతూ ఉంటాయి. పరికరాలు బెడ్‌పై నిద్రించడానికి ప్రయత్నిస్తున్న సమయాన్ని, నిద్రపోయిన సమయం, నిద్ర సామర్థ్యం మొదలైన వివిధ విభిన్న ప్రమాణాలను ట్రాక్ చేస్తాయి. ఈ సంకేతాలు రాత్రి నిద్ర లక్షణాలు మరియు మొత్తం నిద్ర అలవాట్లు మరియు నమూనాలకు సంబంధించిన అభిప్రాయాన్ని అందించడానికి విశ్లేషించబడతాయి” అని కుక్ వివరించారు.

స్లీప్ ట్రాకర్స్ ఎంత వరకూ ఖచ్చితమైనవి?

”మొత్తం నిద్ర వ్యవధిలో 50 నుంచి 70 శాతం వరకు ఉండే నిద్ర దశలను కచ్చితంగా వర్గీకరించడానికి ఆధునిక స్లీప్ ట్రాకర్‌లు అభివ‌ృద్ధి చెందాయి. స్లీప్ ట్రాకర్ల ఆవిష్కరణతో సాంకేతికత బాగా అభివృద్ధి చెందింది. అయితే కదిలిక లేకుండా మేల్కొని ఉండటం వంటి నిర్ధిష్ట ప్రమాణాలను లెక్కించడంలో కొన్ని సమస్యలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఇది నిద్ర సామర్థ్యం మరియు నాణ్యతను ఎక్కువగా అంచనా వేయడానికి దారితీస్తుంది” అని కుక్ చెప్పారు.

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న మాససిక వైద్య నిపుణుడు డాక్టర్ జాన్ క్రూస్ మాట్లాడుతూ.. నిద్ర అధ్యయనాలకు సాంప్రదాయ విధానాలు ప్రధానంగా EEGలు(ఎలక్ట్రాన్ ఎన్సెఫాలోగ్రామ్), EMGలు(ఎలక్ట్రోమియోగ్రఫీ) ఉపయోగిస్తాయి. ఈ పరికరాలు ముక్కు/నోరు, ఛాతీ విస్తరణ మరియు కొన్నిసార్లు వాయిస్ ప్రింట్‌ను కొలుస్తాయి. అయినప్పటికీ, నిద్ర దశలను 70 నుంచి 90శాతం వరకూ మాత్రమే కచ్చితంగా అంచనా వేయగలవని ఆయన చెప్పారు.

స్లీప్ ట్రాకర్ల ప్రభావాలు

స్లీప్ ట్రాకర్స్ వ్యక్తులపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయని చెన్నైలోని ఫోర్టిస్ ఆసుపత్రికి చెందిన కౌన్సెలర్ ముంతాజ్ బేగం చెప్పారు. ఏదైనా లోపం లేదా తప్పుడు లెక్కలు వినియోగదారు నిద్ర విధానాలు మరియు జీవనశైలి నిర్ణయాలపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు.

ఆందోళన- నిద్ర నాణ్యతపై తక్కువ స్కోర్లు కొన్నిసార్లు ఎక్కవ ఆందోళన, నిరాశ మరియు ప్రతికూల ప్రభావానికి దారితీయొచ్చు.

స్వీయనిర్ధారణ- అసాధారణమైన నిద్ర విధానాల విషయంలో వైద్యుని సంప్రదించకుండానే వ్యక్తులు నిద్రలేమి లేదా ఇతర నిద్ర సంబంధిత రుగ్మతలను కలిగి ఉన్నారని స్వీయ నిర్ధారణ చేస్తారు.

వ్యసనం- వినియోగదారులు తమ శరీరం యొక్క జీవ గడియారం కంటే మెరుగైన నిద్ర స్కోర్‌లను పొందడానికి గాడ్జెట్‌లు/ పరికరాలపై ఆధారపడతారు.

నిద్ర విధానాలను మార్చడం- ప్రతి ఒక్కరికి వేర్వేరు నిద్ర విధానాలు ఉంటాయి. కొంతమందికి 6 గంటల నిద్ర తర్వాత రీఫ్రెష్‌గా అనిపిస్తుంది. మరికొందరికి 9 గంటల నిద్ర అవసరం కావచ్చు. వారి నిద్ర స్కోర్‌లు ఈ కారకాన్ని పరిగణలోకి తీసుకోనందును వారు బాగా నిద్రపోయినప్పుడు తక్కువ స్కోర్‌లను ఎందుకు పొందామని వారు ఆశ్చర్యపోతున్నారు.

గుర్తుంచుకోవాల్సిన అంశాలు

సరిగ్గా ఉపయోగించినట్లయితే.. మనం ధరించే స్లీప్ ట్రాకర్ మన నిద్ర విధానాలను గుర్తించడంలో సహాయపడుతుంది. మెరుగైన నిద్ర కోసం జీవనశైలిలో మార్పులు చేసి తద్వారా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని జైపూర్‌లోని ఫోర్టిస్ ఎస్కార్ట్ ఆస్పత్రి, క్రిటికల్ కేర్ మరియు ఇంటర్నల్ మెడిసిన్ డిపార్ట్‌మెంట్ సీనియర్ స్పెషలిస్ట్ పంకజ్ ఆనంద్ చెప్పారు.

నిద్రను అంచనా వేయడానికి స్లీప్ ట్రాకర్లు ప్రామాణికం కాదు. బదులుగా అవి మీ మెరుగైన నిద్ర విధానాలపై మరియు మెరుగైన ఆరోగ్యం కోసం సరైన జీవనశైలి నిర్ణయాలు తీసుకోవడంలో మీకు సహాయపడతాయి.

నిద్ర నాణ్యత స్కోర్‌లపై ఎవరూ ఆధారపడకూడదు. వాటిని పెద్దగా పట్టించుకోకూడదు. అందుకు బదులుగా నిద్ర దశలను కొలతగా చూడండి. కాలక్రమేణా ఒకరి నిద్రలో మార్పులను అర్థం చేసుకోవడానికి దాన్ని ఉపయోగించండి. అయితే వారు మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తే మాత్రం.. వారు కచ్చితంగా మీకు సహాయం కంటే ఎక్కువ ఇబ్బందిని కలిగిస్తున్నారని అర్థం.

మీ అనుభవాన్ని లేదా వ్యాఖ్యలను పంచుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ట్రెండింగ్

వ్యాసాలు

0

0

0

Opt-in To Our Daily Newsletter

* Please check your Spam folder for the Opt-in confirmation mail

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

మీ అభిప్రాయం విజయవంతంగా సమర్పించబడింది.

హ్యాపీయెస్ట్ హెల్త్ టీమ్ వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తుంది