728X90

0

0

0

0

0

0

0

0

0

ఈ వ్యాసంలో

పిల్లలు సరిగ్గా నిద్రపోవడం లేదా? ఏం చేయాలో తెలుసుకోండి
14

పిల్లలు సరిగ్గా నిద్రపోవడం లేదా? ఏం చేయాలో తెలుసుకోండి

టీనేజర్లలో నిద్ర సమస్యలు రోజురోజుకు తీవ్రం అవుతున్న సమస్య. దీనికి గ్యాడ్జెట్‌లు ఎక్కువ వాడటం, వ్యాయామం చేయకపోవడం వంటి అనేక కారణాలు ఉన్నాయి. అందుబాటులో ఉన్న చికిత్సలను వివరిస్తూ, అసలు సమస్యను గుర్తించడం కీలకం అని చెప్పారు వైద్యులు. 
టీనేజర్లలో నిద్ర సమస్య
పిల్లలు సరిగా నిద్రపోవడం అనేది టీనేజర్లలో మిస్సవుతోంది

టీనేజర్లలో నిద్ర సమస్య:ఎనిమిది గంటలు ప్రశాంతంగా నిద్రపోవడం అనేది చాలా మంది టీనేజర్లకు తీరని ఆశ. టీనేజర్లకు నిద్ర విషయంలో ఉన్న సమస్యలను గుర్తించి, చికిత్స చేయాలి.

అర్థరాత్రి అయినా కూడా నిద్రపోకుండా ఏదో వీడియోలు చూస్తానో లేదా ఖాళీగా సీలింగ్ చూస్తునో మెలకువగా ఉండే టీనేజర్లు ఈ మధ్య ప్రతీ ఇంట్లోను కనిపిస్తున్నారు. ఇలాంటి టీనేజర్లను బద్ధకస్తులని లేదా ఏ పని చేయని వారని ముద్ర వేయడం కంటే వారికి నిద్ర పట్టకపోవడం అనే సమస్యకు చికిత్స చేయించడం మనం చేయాల్సిన పని అని నిపుణులు సూచిస్తున్నారు. 

యుక్తవయస్సులో ఉన్న వారిలో నిద్రలేమి అలాగే ఇతర నిద్ర సమస్యలకు కారణాలు ఏమిటి?

యుక్త వయస్సులోని వారిలో నిద్రలేమి సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయని, దీనికి ప్రధాన కారణాలు మందకొడి జీవనశైలి, ఎక్కువ శారీరక కదలిక లేకపోవడం అలాగే స్మార్ట్ స్క్రీన్లు ఇంకా గ్యాడ్జెట్‌లను నిరంతరం ఉపయోగించడం అని అన్నారు డాక్టర్ భరత్ రెడ్డి. ఈయన బెంగళూరులోని  శిశుక చిల్డ్రన్స్ ఆసుపత్రిలోని పీడియాట్రిక్ పల్మనాలజిస్ట్. 

 కొలరాడో విశ్వవిద్యాలయంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పీడియాట్రిక్ పల్మనరి జనరల్ ఆపరేషన్స్‌ అసోసియేట్ ప్రొఫెసర్ అలాగే పీడియాట్రిక్ స్లీప్ సైకాలజిస్ట్ డాక్టర్‌ స్టేసీ 2020లోనిద్రలేమిసమస్యతో బాధపడిన 15-ఏళ్ళ బాలికకు తాను చికిత్స చేసిన విషయం గుర్తు చేసుకున్నారు. ఆ అమ్మాయి నిద్ర సమయం ఆలస్యంగా ఉండటం వలన ఆరోగ్యం అలాగే చదువు రెండింటికి ఇబ్బంది ఏర్పడింది. ఆ అమ్మాయి రాత్రంతా మెలకువగా ఉండేది అలాగే తెల్లవారుఝామున కూడా నిద్ర పట్టేది కాదు తనకి.  

తను ఆలస్యంగా నిద్ర లేవడం వలన కుటుంబంతో కలిసి కూర్చోవడం, కలిసి భోజనం చేయడం వంటివి చేయకలేకపోయేది. పగటిపూట కూడా నిద్రపోయి ఉండటం వలన అందరూ తనని బద్ధకస్తురాలు అనే వారు అని చెప్పారు డాక్టర్ సైమన్. చికిత్స సమయంలో క్రోనోథెరపీ అనే ప్రవర్తన సంబంధిత మార్పుతో ప్రారంభంలోనే మూడు గంటల పాటు తన నిద్ర సమయంలో మార్పుతో తనసర్కాడియన్ రిథమ్‌లో మార్పు తీసుకురాగలిగాము. 

జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్(JAMA Psychiatry) ప్రచురించబడిన, నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో అందుబాటులో ఉన్న అధ్యయనం ప్రకారం క్రోనోథెరపీ అంటే కావలసిన నిద్ర మరియు మేల్కొనే సమయాలు పాటించడం అలవాటు అయ్యి, వాటిని పాటిస్తూ నిర్దిష్ట సమయాలు అలాగే నిద్ర-సమయంలో సరైన అలవాట్లు ఏర్పడే వరకు ప్రతీ రెండు రోజులకు మూడు గంటల పాటు నిద్ర సమయం అలాగే మేల్కొనే సమయాన్ని ఆలస్యం చేయడం ద్వారా ఒకరి సర్కాడియన్ క్లాక్‌లో మార్పు తీసుకువచ్చే ప్రవర్తన సంబంధిత థెరపీ.” 

డాక్టర్ సైమన్, టీనేజర్లలో ఊబకాయం, చిన్న వయస్సులోనే ఇన్‌స్యూలిన్ రెసిస్టెన్స్ రావడం, హృదయ సంబంధిత సమస్యలు అలాగే నిద్ర సమస్యలకు ఉన్న సంబంధాన్ని అధ్యయనం చేస్తున్నారు. 

మహమ్మారి సమయంలో యుక్తవయస్కులలో నిద్ర అలవాట్లు మరింత క్షీణించాయి 

డాక్టర్ రెడ్డి అలాగే డాక్టర్ సైమన్ అభిప్రాయంలో, కోవిడ్ మహమ్మారి సమయంలో యుక్త వయస్సులోని పిల్లలలో నిద్ర అలవాట్లు మరింత అధ్వాన్నంగా మారాయి. ఎందుకంటే, నిద్రపోయే-మేల్కొనే సమయాలలో చాలా మార్పులు వచ్చాయి. లాక్‌డౌన్ సమయంలో టీనేజర్లు ఆన్‌లైన్ స్కూల్ కారణంగా తప్పనిసరిగా ఎక్కువ సమయం గ్యాడ్జెట్‌లు వినియోగించడం చేశారు. ఇది అప్పటికే పాడయిన నిద్ర సమయాలకి మరింత ఇబ్బందికరంగా మారింది. అలాగే టీనేజర్లలో బరువు పెరగడం, చిన్న వయస్సులోనే టైప్-2 డయాబెటిస్ రావడం, మందకొడి జీవనశైలి అలాగే వ్యాయామం లేకపోవడాన్ని వైద్యులు గమనించారు. 

యుక్త వయస్సు వారిలో నిద్ర సమస్యలకు చికిత్స 

టీనేజర్లలో నిద్ర సమస్యలను పరిష్కరించడానికి నిపుణులు సూచించిన కొన్ని మార్గాలు: 

  1. కాంతి థెరపీ: ప్రతీ ఒక్కరి శరీరంలో నిద్రపోయే సమయాన్ని అలాగే మేల్కొనే సమయాన్ని నియంత్రించే సర్కాడియన్ రిథమ్ అనే అంతర్గత గడియారం ఉంటుంది. ఈ గడియారంలో అవకతవకలు వచ్చినప్పుడు, సర్కాడియన్ రిథమ్ మళ్ళీ నియంత్రణలోకి రావడానికి బాక్స్‌ల ద్వారా కృత్రిమ కాంతిని పంపించడాన్ని బ్రైట్ లైట్ థెరపీ (కాంతి థెరపీ) అంటారు. ఈ థెరపీలో ఒక వ్యక్తిని ఉదయాన్నే నిద్ర లేపి వారిలో పగటి పూట మెలటోనిన్ ఉత్పత్తిని ఆపడానికి లైట్ బాక్స్‌కు ఎక్స్‌పోజ్ చేస్తారు. నిద్ర లేచిన వెంటనే దీనిని ఉపయోగించడం వలన సూర్యరశ్మిని అనుకరిస్తుంది అని Happiest Healthకు చెప్పారు ప్రొఫెసర్ సైమన్. ఈ థెరపీని ప్రత్యేకించి పగటి పూట తక్కువగా ఉండే ప్రాంతాలలో ఉపయోగిస్తారు, అంటే శీతాకాలంలో అలాగే పాశ్చాత్య దేశాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. 
  2. నిద్ర సమయాన్ని ముందుకు మార్చడం: నిద్రలేకపోవడం వలన ఇబ్బంది పడుతున్న టీనేజర్లలో నిద్ర సమయాన్ని ముందుకు మార్చడం అనేది ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి అని డాక్టర్ రెడ్డి అన్నారు. భారతదేశంలోటీనేజర్లలో నిద్ర సమస్య నివారించడానికి ఉపయోగించే మార్గాలను వివరిస్తూ ఉదాహరణకు, ఒకరికి అర్థరాత్రి 2 గంటలకు మాత్రమే నిద్ర పడుతుంటే, మేము దానిని అర గంట నుండి గంట వరకు అలా కొద్దికొద్దిగా ముందుకు మార్చడం ద్వారా మెల్లగా ఆ సమయాన్ని రాత్రి 10 గంటలకు తీసుకువచ్చేలా మార్చడానికి ప్రయత్నం చేస్తాము, అని అన్నారు డాక్టర్ రెడ్డి. 
  3. కౌన్సెలింగ్: నిద్ర పట్టని వ్యక్తులను బద్ధకస్తులని, మానసిక వ్యాకులత కలిగిన వారు అని, నలుగురిలో కలవడం ఇష్టం లేని వారు అని ముద్ర వేసేస్తారు. కానీ చేయాల్సింది దీనికి పరిష్కారం ఇవ్వడం. చికిత్స చేస్తున్న వైద్యులు ఇలాంటి సమస్యలను గుర్తించి, నిద్ర సమస్యల నిపుణులకు సిఫార్సు చేయాలి. సమస్య నిద్ర విషయంలో అయినప్పుడు డిప్రెషన్‌కు మందులు ఇవ్వడం వలన సమస్య పరిష్కారం అవ్వదు అని అన్నారు డాక్టర్ రెడ్డి. అసలు సమస్యను పరిష్కరించాలి. నిద్ర పోవడానికి అలాగే మేల్కోవడానికి నిర్దిష్ట సమయం ఉండటం కీలకం అని చెప్పారు. 
  4. క్రోనోథెరపీ: నిద్రపోయే సమయం అలాగే మేల్కొనే సమయాన్ని ప్రతీ రోజు 2-3 గంటలు ముందుకు మార్చడం ద్వారా నిద్ర సమయాలలో టీనేజర్లు లేదా పెద్దలలో నిద్ర సమయాలలో మార్పు తీసుకువచ్చే విధానం ఇది. ఒక అమ్మాయికి 5 am గంటల వరకి నిద్ర పడుతుంది అనుకుందాం, మేము తన నిద్ర సమయాన్ని మూడు గంటలు ఆలస్యం చేసి 8 am దాకా నిద్రపోయేలా చేస్తాం. మెల్లగా తను రాత్రి నిద్రపోయి, ఉదయం నిద్రలేచేలా చేస్తాం అని ఒక ఉదాహరణతో వివరించారు ప్రొఫెసర్ సైమన్. 
  5. మెలటోనిన్ సప్లిమెంట్లు: నిద్ర లేకపోవడానికి మరొక కారణం మెలటోనిన్ లోపం. దీనిని వ్యక్తి పరిస్థితిని బట్టి మెలటోనిన్ వంటి అదనపు పోషకాహారం అందించడం ద్వారా పరిష్కరించాలి. మెలటోనిన్ అనేది నిద్రను ప్రేరేపించే హార్మోన్. ఈ సప్లిమెంట్‌ను తీవ్రంగా నిద్ర లోపం ఉన్న వారికి మాత్రమే ఇస్తారు. దీనిని రాత్రి పూట ఒక నిర్దిష్ట సమయంలో ఉపయోగించడం వలన నిద్ర పట్టి, సర్కాడియన్ రిథమ్ దారిలోకి వస్తుంది అని చెప్పారు డాక్టర్ రెడ్డి. 
  6. ఉదయం నడక: టీనేజర్లలో నిద్రలేమికి చేసే చికిత్స కీలకమైన అంశం మందులు ఉపయోగించకుండా ఉదయం నడవటం వంటి వాటి పరిష్కారాల సమస్యను పరిష్కరించడం. విటమిన్ D శోషణం బాగా ఉన్నప్పుడు ఒక వ్యక్తిలో మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి సరిగ్గా జరుగుతుంది కాబట్టి, ఉదయం ఎండలో నడవటం అనేది నిద్ర సమస్య ఉన్న వారిపై చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అని వివరించారు డాక్టర్ రెడ్డి. 
  7. ఆరుబయట ఆటలు: ఆరుబయట ఎక్కువ ఆడుకునే పిల్లలకు నిద్ర బాగా పడుతుంది అని చెప్తూ, నిద్ర సమస్యలు ఉన్న టీనేజర్లను బయట ఎక్కువ ఆడుకోవడానికి ప్రోత్సహించాలి అని చెప్తున్నారు డాక్టర్ సైమన్. ఆరుబయట ఏ ఆటైనా ఆడుకోవచ్చు అని అన్నారు. 

గుర్తుంచుకోవాల్సిన అంశాలు

టీనేజర్లలో నిద్ర సమస్యలు రోజురోజుకు తీవ్రం అవుతున్న సమస్య. దీనికి గ్యాడ్జెట్‌లు ఎక్కువ వాడటం, వ్యాయామం చేయకపోవడం వంటి అనేక కారణాలు ఉన్నాయి. అందుబాటులో ఉన్న చికిత్సలను వివరిస్తూ, అసలు సమస్యను గుర్తించడం కీలకం అని చెప్పారు వైద్యులు. 

మీ అనుభవాన్ని లేదా వ్యాఖ్యలను పంచుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ట్రెండింగ్

వ్యాసాలు

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient
We use cookies to customize your user experience, view our policy here

మీ అభిప్రాయం విజయవంతంగా సమర్పించబడింది.

హ్యాపీయెస్ట్ హెల్త్ టీమ్ వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తుంది